కరోనా నివారణ చర్యలపై సీఎం జగన్ సమీక్ష... ఆ జిల్లాల్లో నిబంధనలు కఠినంగా అమలు చేయాలని ఆదేశాలు...?
ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో కరోనాను నియంత్రించడం కోసం వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. తాజాగా సీఎం జగన్ తాడేపల్లి నివాసంలో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అధికారులకు జగన్ కీలక సూచనలు చేశారు. రాష్ట్రంలో లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. కొత్తగా కేసులు నమోదవుతున్న జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.
కరోనా కట్టడి కోసం అన్ని రకాల చర్యలు చేపట్టాలని సూచించారు. రెడ్ జోన్ జిల్లాలలో నిబంధనలు కఠినంగా అమలు చేయాలని... అదే సమయంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని చెప్పారు. మరోవైపు రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రాష్ట్రంలో ఈరోజు 50 కరోనా కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో 16 కేసులు నమోదు కాగా కర్నూలు జిల్లాలో 13 కేసులు నమోదయ్యాయి.