మాస్టర్ సినిమా ట్రైలర్ విడుదలపై క్లారిటీ ఇచ్చిన ..చిత్ర బృందం !!

Surya

 

హీరో విజయ్ నటించిన ప్రతిష్టాత్మక చిత్రం మాస్టర్. మాస్టర్ సినిమాలో విజయ్ ఓ లెక్చరర్ గా కనిపించనున్నాడు. అయితే ఈ సినిమా ఏప్రిల్ నెలలో విడుదల చేయాలనీ చిత్ర యూనిట్ అనుకున్నారు . అయితే లాక్ డౌన్ కారణంగా ఈ  చిత్రం విడుదలను వాయిదా వేస్తున్నట్లు తెలిపారు అయితే ఈ సినిమాకి సంబంధించి ట్రైలర్ ను విడుదల చేస్తున్నట్లు వస్తున్న వార్తల పై చిత్ర యూనిట్ పెదవి విప్పింది .

 

ఇప్పట్లో ట్రైలర్ గురించి ఊసెత్తవద్దని తెలియజేసింది. అయితే గతంలో ఈ చిత్రం విడుదలకి సంబంధించి వచ్చిన పుకార్లను చిత్ర యూనిట్ ఇదివరకే కొట్టిపడేసింది. అయితే అమెజాన్ లో చిత్రాన్ని విడుదల చేయడం లేదని వెల్లడించింది .  లాక్ డౌన్ ఎత్తివేసిన తరువాత చిత్రం విడుదలకు డేట్ ఫిక్స్ చేస్తామని ఆ తరువాతనే ట్రైలర్ విడుదల చేస్తామని చిత్ర యూనిట్ పేర్కొంది 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: