పరేషాన్ కాకండీ.. ఇది ముమ్మాటికీ గొర్రె!
సాధారణంగా కొన్ని గొర్రెలు ఉన్నికోసం ప్రత్యేకంగా పెంచుతుంటారు.. ఆ ఉన్ని ద్వారా రక రకాల వస్త్రాలు తయారు చేస్తుంటారు. కొన్ని సార్లు ఉన్ని కోసం ఎక్కువ సమయాన్ని పొడిగించడం వల్ల గొర్రెల్ చాలా విచిత్రంగా తయారవుతుంటాయి. తాజాగా ఓ గొర్రె పరిస్థితి ఇలాగే ఉంది. అయితే దీన్ని చాలా మంది ఓ వింత జంతువు అనుకొని హడలెత్తిపోయారు. సోషల్ మీడియాలో ఈ గొర్రె ఫోటో తెగ వైరల్ అవుతుంది. ఓ గొర్రెకు ఆరేళ్ల వరకు ఉన్ని కత్తిరించలేదు. ఇంకేముంది.. దాని అవతారం చాలా విచిత్రంగా మారింది. దూరం నుంచి చుస్తుంటో ఓ చిన్నపాటి కొండ కదలివస్తున్నట్లు అనిపిస్తుంది. సాధారణంగా ఉన్ని కోసం గొర్రెలను సాకుతుంటారు.. ఇలా వాటి ద్వారా వచ్చే ఉన్ని కట్ చేసి కంపెనీలకు అమ్ముతుంటారు.
ఇలాంటి ఉన్ని తయారు చేసే పరిశ్రమలు.. గొర్రెలు ఎక్కువ మంచు ప్రాంతాల్లో ఉంటుంటాయి. అయితే ఆ గొర్రెకు ఆరేళ్ల వరకు ఎందుకు ఉన్ని తీయలేదంటే.. ఓ ఫాం నుంచి తప్పించుకుని పారిపోయిన గొర్రె.. పర్వత ప్రాంతాల్లో 6 సంవత్సరాలు తిరిగిందట. తోడేళ్లు గొర్రెను తినేందుకు ప్రయత్నించగా..ఆ గొర్రె దేహంపై వెంట్రుకలు ఎక్కువుండటంతో వాటి బారి నుంచి సురక్షితంగా బయటపడింది. గొర్రెకు ఇప్పటివరకు సుమారు 60 పౌండ్ల బరువున్న ఉన్ని పెరిగిందట. ఈ గొర్రె ఫొటో ఇపుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
This sheep escaped a farm and spent 6 years in the mountains, during which time he grew 60 pounds of wool.
It is said that Wolves tried to eat him, but their teeth could not penetrate the floof.
Amazing stuff. From SM. pic.twitter.com/AaIQSsMJim — Susanta Nanda IFS (@susantananda3) May 3, 2020