20 వసంతాల టీఆర్‌ఎస్... వైరల్ అవుతున్న కేసీఆర్ ఇంట్రెస్టింగ్ ఫోటో...!

Reddy P Rajasekhar

టీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భవించి నేటికి 20 సంవత్సరాలైంది. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్ రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ ట్విట్టర్ ఖాతాలో సీఎం కేసీఆర్ పాత ఫోటోను షేర్ చేసి ఆ ఫోటోకు సంబంధించిన విషయాలను షేర్ చేసుకున్నారు. జలదృశ్యం నుంచి కేసీఆర్ తో కలిసి తాను నడుస్తున్నానని ఆయన పేర్కొన్నారు. ఆయనతో కలిసి చేసిన ప్రయాణం ఎంతో ఆసక్తికరంగా ఉందని... కేసీఆర్ నుంచి ఎన్నో నేర్చుకున్నానని అన్నారు. 
 
కేసీఆర్ తో తాను చేసిన ప్రయాణంలో ఒక్కరోజు కూడా బోర్ కొట్టలేదని చెప్పారు. తెలంగాణ ఉద్యమం లాంటి ఎన్నో సంతోషాన్నిచ్చే జ్ఞాపకాలు ఉన్నాయని తెలిపారు. ఎంపీ షేర్ చేసిన ఫోటోలో కేసీఆర్ పాతకాలం నాటి ఇంట్లో గడ్డం గీసుకుంటూ కనిపిస్తున్నారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ ఫోటోపై నెటిజన్లు కామెంట్లు చేస్తూ సీఎం కేసీఆర్ కు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు చెబుతున్నారు. 
 
లాక్ డౌన్ వల్ల పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిరాడంబరంగా జరుపుకోవాలని టీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు నిర్ణయం తీసుకున్నాయి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: