ఫోటోలు : వీధి కుక్కలకు కూడా తిండిపెడుతున్న జీహెచ్ఎంసీ...!

Reddy P Rajasekhar

దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా బాధితుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. లాక్ డౌన్ వల్ల ప్రజలు పూర్తిగా ఇళ్లకే పరిమితమయ్యారు. పలు ప్రాంతాల్లో జంతువులు ఆహారం దొరకక ఆకలితో అలమటిస్తున్నాయి. నీళ్లు, ఆహారం దొరకక చనిపోతున్నాయి. ఇలాంటి ఘటనలు దేశవ్యాప్తంగా వెలుగులోకి వస్తూ ఉండటంపై జంతు ప్రేమికులు విషాదం వ్యక్తం చేస్తున్నారు.  
 
అయితే హైదరాబాద్ నగరంలో జీహెచ్ఎంసీ వీధికుక్కలకు ఆహారం అందిస్తూ గొప్పమనస్సును చాటుకుంది. పారిశుద్ధ్య కార్మికులు కూకట్ పల్లి జోన్ లో వీధికుక్కలకు ఆహారం అందజేశారు. మూగజీవులకు ఆహారం అందించి మానవత్వం చాటుకున్నారు. జీహెచ్ఎంసీ నగరంలోని మిగతా ఏరియాల్లో కూడా ఇదే విధంగా మూగజీవాలకు ఆహారం అందిస్తూ ఉండటంపై జంతు ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 
 
ఇతర ప్రాంతాల్లో సైతం ప్రభుత్వం మూగజీవాలకు ఆహారం అందించేలా చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు. మరి ప్రభుత్వం జంతు ప్రేమికుల విజ్ఞప్తుల పట్ల ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: