టబు పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఆ స్టార్ హీరోయిన్ భర్తేనట !
టబు చిన్నప్పటి నుంచే సినిమాల్లో నటించడం ప్రారంభించింది. 'హమ్ నౌజవాన్' నుంచి దేవ్ ఆనంద్ ద్వారా ఆమెకు తొలి అవకాశం దక్కింది. ఆ సమయంలో టబు వయస్సు కేవలం 14 సంవత్సరాలు. సినిమాలో ఆమె అత్యాచార బాధితురాలి పాత్రను పోషించింది. ఆ పాత్రలో ఆమె నటనపై ప్రశంసల వర్షం కురిసింది.
టబు 1991 తెలుగు సినిమా "కూలీ నెంబర్ 1"లో వెంకటేష్ సరసన హీరోయిన్ గా నటించి టాలీవుడ్ లో తన కెరీర్‌ని ప్రారంభించింది. దీని తర్వాత టబు అజయ్ దేవగన్ సరసన 'విజయపథ్'లో నటించింది. ఆ తర్వాత నటి వెనుదిరిగి చూసుకోలేదు. ఆమె కెరీర్‌లో 'బీవీ నంబర్ 1, హుటుటు, హేరా ఫేరీ, మక్బూల్, చీనీ కమ్, హైదర్, దే దే ప్యార్ దే, భూల్ భులయ్యా 2' వంటి అనేక చిత్రాలలో నటించింది. తెలుగు ప్రేమ దేశం, నిన్నే పెళ్లాడతా, పాండురంగడు వంటి ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించింది.
టబు పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఆ స్టార్ హీరోయిన్ భర్తేనట !
టబు కెరీర్ సక్సెస్ ఫుల్ గా సాగినప్పటికీ ఆమె ఇప్పటికీ ఒంటరిగా ఉంది. నేను ఇప్పటి వరకు ఒంటరిగా ఉన్నానంటే దానికి కారణం అజయ్ దేవగన్ అని ఈ బ్యూటీ తన ఇంటర్వ్యూలో చెప్పింది. నా కజిన్ సమీర్ ఆర్య, అజయ్ దేవగన్ ఇరుగు పొరుగు అని టబు చెప్పింది. ఇద్దరూ నా మీద ఓ కన్నేసి ఉంచి నన్ను అనుసరించేవారు. నా దగ్గరికి ఎవరైనా అబ్బాయి వస్తే ఇద్దరూ కొట్టేవారు. అజయ్ దేవగన్ వల్లే నేను ఒంటరిగా ఉన్నాను అని చెప్పుకొచ్చింది టబు. అజయ్ తనకు చాలా మంచి స్నేహితుడని చెప్పుకొచ్చింది. మేమిద్దరం చాలా సినిమాల్లో కలిసి పనిచేశాం. అతను నాకు చాలా రక్షణగా ఉన్నాడు అని చెప్పుకొచ్చింది. ఇక అజయ్ దేవగన్ స్టార్ హీరోయిన్ కాజోల్ అగర్వాల్ భర్త అన్న విషయం అందరికీ తెలిసిందే.