టాలీవుడ్ నవ్వుల రారాజు అలీ

Vimalatha
టాలీవుడ్ నవ్వుల రారాజు అలీ పుట్టిన రోజు నేడు. బాలనటుడిగా సినిమా ఎంట్రీ ఇచ్చి ఆయన నేటికీ సీనియర్ కమెడియన్ గా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. అలీ 12 ఏళ్ల వయసు లోనే చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టారు. అప్పటి నుంచి ఇప్పటి దాకా తెలుగుతో పాటు పలు భాషల్లో ప్రేక్షకులను గిలిగింతలు పెడుతూనే ఉన్నారు. వందలాది చిత్రాల్లో ఆయన అభినయం చూస్తే ఇప్పటికీ నవ్వు రాక మానదు. 'మసా థాయ్ మసా' అంటూ అలీ పండించిన కామెడీ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు.
1967 అక్టోబర్ 10న రాజమహేంద్రవరంలో జన్మించాడు అలీ. చదువుకునే రోజుల్లోనే స్నేహితులతో ఆయన చేసే కామెడీ అందరిని భలేగా నవ్వించేది. అలా చిన్న ప్రాయంలోనే స్టార్ హీరోల సినిమాలు చూసి వాటిని బట్టీ పట్టి తనకు నచ్చిన రీతిలో స్నేహితులకు చెబుతూ ఉండేవాడు. ఒకసారి అలీ చేసింది చూసిన జిత్ మోహన్ మిత్ర అనే నటుడు సినిమాల్లో ఆయనకు అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన 'నిండు నూరేళ్లు' సినిమాలో మొదటిసారి వెండి తెరపై కనిపించాడు అలీ. అందులో ఆయన నటన బాగుండడంతో దర్శకుడు భారతీరాజా 'సీతాకోకచిలుక' సినిమా కోసం తీసుకున్నాడు. అందులో అలీ హీరో చిన్న వయసులో ఉన్న హీరో పాత్రలో నటించాడు. రెండు సినిమాలు అలిగి మంచి గుర్తింపు రావడంతో ఆ తర్వాత జంధ్యాల రూపొందించిన 'మూడు ముళ్లు' సినిమాలో అవకాశం వచ్చింది.
అయితే ఆ వయసు నుంచే నవ్వులు పంచుతూ సాగిన అలీ ఎస్వీ కృష్ణారెడ్డి సినిమా 'యమలీల' లో హీరోగా నటించాడు. ఆ సినిమా స్వర్ణోత్సవం జరగడం విశేషం. ఆ తర్వాత అన్ని నటించిన 'పిట్టలదొర,  ఆవారాగాడు, గుండమ్మగారి మనవడు వంటి చిత్రాలు బాగా ఆకర్షించాయి. దీంతో ఆలీ హీరో గానే కాకుండా కమెడియన్ గానూ నటిస్తూ కోట శ్రీనివాసరావు, మోహన్ బాబు అంటే సీనియర్ కమెడియన్ లతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: