క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి విలన్ దాకా... అజయ్ బర్త్ డే !

Vimalatha
క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి విలన్ దాకా అన్ని వర్గాల ప్రేక్షకుల మెప్పు పొందిన నటుడు అజయ్. ఈ తెలుగు నటుడు కేవలం తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ చిత్రాలలోనూ నటించాడు. ఆరడుగుల పొడుగు, ఆకరణీయమైన రూపంతో హీరోకు ఏమాత్రం తీసిపోని అజయ్ పుట్టిన రోజు నేడు.
అజయ్ 1978లో సెప్టెంబర్ 26న ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో పుట్టారు. ఈ నటుడు తెలుగు ప్రేక్షకులతో పాటు తమిళ, కన్నడ ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి హీరో గా ఎదిగాడు. ఆయన కొన్ని సినిమాల్లో హీరోగా కూడా నటించాడు. 2000 సంవత్సరంలో తెలుగు సినిమా "కౌరవుడు" ద్వారా అజయ్ తన నట జీవితాన్ని ప్రారంభించాడు. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన తొలి చిత్రం "స్టూడెంట్ నం. 1" చిత్రంలో జూనియర్‌ ఎన్టీఆర్ తో కలిసి నటించారు. ఈ చిత్రంలో ఆయన కన్పించింది చిన్న పాత్రలోనే. కానీ అజయ్ కు నటుడి గా ఆ పాత్రతో మంచి గుర్తింపు లభించింది. అతను 2006 లో రాజమౌళితో తన సూపర్ హిట్ చిత్రం 'విక్రమార్కుడు'లో విలన్ గా కన్పించాడు. తన 2 దశాబ్దాల సుదీర్ఘ కెరీర్‌ లో దాదాపు 100 తెలుగు సినిమాలలో నటించాడు. ఆ సమయంలో తెలుగు చిత్ర పరిశ్రమలోని ప్రముఖు దర్శకులు, హీరోలు అందరితో కలిసి నటించాడు.
 
తెలుగుతో పాటు కన్నడ, తమిళ చిత్రాలలో కూడా తన మార్క్ చాటుకున్నాడు. కిరీడం, కూట్టం, ఉయిరే ఉయిరే, 24 వంటి తమిళ చిత్రాలలో కీలకపాత్రలు పోషించాడు. కన్నడ చిత్ర పరిశ్రమలో కూడా సారథి, కటారి వీర సురసుందరంగి, మైనా వంటి హిట్ చిత్రాలలో కన్పించాడు. అజయ్ 2005 లో శ్వేత రావూరిని వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ఒక కొడుకు, కూతురు ఉన్నారు. ప్రస్తుతం అజయ్ అడపాదడపా సినిమాల్లో కన్పిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: