టాలీవుడ్ కింగ్‌.. నేడు యువ ‌సామ్రాట్ నాగార్జున జ‌న్మ‌దినం..

Spyder
వ‌య‌స్సు పెరుగుతున్నా అందం ఏమాత్రం త‌గ్గ‌ని సీనియ‌ర్ టాలీవుడ్ హీరో యువ‌సామ్రాట్ అక్కినేని నాగార్జున. శివ సినిమాతో యూత్‌లో స‌రికొత్త ట్రెండ్‌ను సృష్టించాడు. మాస్‌, క్లాస్, లేడీస్‌, ఫ్యామిలీ చిత్రాల హీరోగా... దాదాపు అన్ని కేట‌గిరీ చిత్రాల్లో న‌టించి మెప్పించాడు నాగార్జున. అన్న‌మ‌య్య సినిమాతో త‌నలోని అస‌లు సిస‌లైన  న‌టుడిని మేల్కొలిపాడు. అన్న‌మ‌య్య‌గా ఒదిగిపోయాడు. తెలుగు సినిమా ఉన్నంత కాలం.. ప్ర‌తీ ఒక్క‌రి హృద‌యాల్లో ఆయ‌న అన్న‌మ‌య్య‌గానే ఉండిపోతార‌న‌డంలో ఎలాంటి ఆశ్చ‌ర్యం లేదు.  అక్కినేని నాగార్జున ఆగష్టు 29, 1959న చెన్నైలో జన్మించారు. నాగార్జున మొదటి చిత్రం విక్రం, 1986 మే 23లో విడుదల అయింది. త‌ర్వాత మజ్నుతో పెద్ద హిట్టును అందుకున్నాడు. ఆ త‌ర్వాత  సినీనటి శ్రీదేవితో నటించిన ఆఖరి పోరాటం సినిమా నాగార్జున ఖాతాలో మ‌రో హిట్టు ప‌డిన‌ట్ల‌యింది. ఈ చిత్రం 12 కేంద్రాలలో 100 రోజులు ఆడింది.

తరువాత మణిరత్నం దర్శకత్వం వహించిన ప్రేమకథా చిత్రం గీతాంజలి భారీ విజయాన్ని సాధించింది. అద్భుతమైన సంగీతం, మంచి కథతో వచ్చిన ఈ చిత్రం నాగార్జునను ప్రేమ కథా చిత్రాల నాయకుడిగా నిలబెట్టింది. ఇది మణిరత్నం నేరుగా తెలుగులో దర్శకత్వం వహించిన ఏకైక చిత్రం. రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించిన యాక్షన్ చిత్రం శివ.  ఈ రెండు చిత్రాలు నేటికి నాగార్జున న‌టించిన అతిపెద్ద భారీ విజ‌యాల్లో ప్ర‌ముఖ‌మైన‌విగా చెప్పుకోవాలి. ఆ తరువాత అన్నమయ్య చిత్రములో వాగ్గేయకారుడు అన్నమయ్య పాత్రను పోషించే సవాలును స్వీకరించి విజయం సాధించారు. ఈ సినిమా 42 కేంద్రాలలో 100 రోజులు పైగా నడిచింది.

ఈ చిత్రానికి గాను నాగార్జున మొదటి సారిగా రాష్ట్ర ప్రభుత్వంచే ఉత్తమ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు. ఈ చిత్రంలో నాగార్జున కనపర్చిన అద్భుత నటనకు ప్రేక్షకుల నుండే కాకుండా విమర్శకుల నుండి కూడా అనేక ప్రశంసలు లభించాయి. అన్నమయ్య చిత్రానికి జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నారు. 2006లో శ్రీ రామదాసు విమర్శకుల ప్రశంశలందుకుంది. ఈ చిత్రంలో నటనకు గాను నాగార్జున రాష్ట్ర ప్రభుత్వం నుండి మూడవ సారి ఉత్తమ నటుడి అవార్దు అందుకున్నారు. మంచి క‌థాబ‌ల‌మున్న పాత్ర‌ల్లో న‌టిస్తూ నేటి యువ‌త‌రం క‌థానాయ‌కుల‌కు స‌వాల్ విసురుతున్నారు. టాలీవుడ్ కింగ్‌గా ప్ర‌ఖ్యాతిగాంచారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: