హెరాల్డ్ బర్త్ డే : 01-08-2020 రోజున జన్మించిన ప్రముఖులు..?
అరుణ్ లాల్ జననం : భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు అయిన అరుణ్ లాల్ భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. ఈయన 1955 ఆగస్టు ఒకటో తేదీన జన్మించారు. భారత క్రికెట్ జట్టులో 26.03 సగటుతో కొనసాగారు అరున్ లాల్. ఎన్నో ఏళ్ల పాటు భారత క్రికెట్ జట్టులో సేవలందించారు అరుణ్ లాల్. తాప్సి పన్ను జననం : భారతీయ చలన చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటి తాప్సీ 1987 ఆగస్టు ఒకటవ తేదీన జన్మించారు. ఝుమ్మంది నాదం అనే సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన తాప్సీ... సినీ పరిశ్రమకు రాకముందు మోడలింగ్ లో కొనసాగేది.
ఝుమ్మంది నాదం తర్వాత ఎన్నో సినిమాల్లో నటించిన తాప్సి మంచి గుర్తింపు సంపాదించింది. ప్రస్తుతం తెలుగులో సినిమాలు తగ్గించినప్పటికీ... బాలీవుడ్ లో మాత్రం నటనకు ప్రాధాన్యం ఉన్న ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసుకుంటూ దూసుకుపోతుంది. ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది తాప్సి. కే ఎస్ రవీంద్ర జననం : తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ దర్శకుడు కేఎస్ రవీంద్ర తెలుగు ప్రేక్షకులందరికీ బాబి గా సుపరిచితుడు. స్క్రీన్ ప్లై రైటర్ గా.. డైరెక్టర్ గా ఎంతగానో పేరు ప్రఖ్యాతలు సంపాదించారు బాబీ. తెలుగు చిత్ర పరిశ్రమలో పలు సినిమాలను తెరకెక్కించి మంచి గుర్తింపు సంపాదించారు బాబీ అలియాస్ కేఎస్ రవీంద్ర . 1983 ఆగస్టు ఒకటో తేదీన జన్మించారు ఈయన.Powered by Froala Editor