హెరాల్డ్ బర్త్ డే : 20-06-2020 రోజున జన్మించిన ప్రముఖులు..?

praveen

జూన్ 20వ తేదీన ఒకసారి చరిత్ర పుటల్లోకి వెళ్లి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జననాలు జరిగాయి. మరి ఒక్కసారి హిస్టరీ లోతుల్లోకి వెళ్లి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో  తెలుసుకుందాం రండి.

 

 రమాకాంత్ దేశాయి జననం : భారత మాజీ క్రీడాకారుడు అయిన రమాకాంత్ దేశాయి  1939 జూన్ 20వ తేదీన జన్మించారు. ముంబై లో జన్మించిన రమాకాంత్ దేశాయ్ 1959లో టెస్టు క్రికెట్లోకి అరంగేట్రం చేశారు. టెస్ట్ క్రికెట్ లో ఫాస్ట్ బౌలర్ గా ఎన్నో ఏళ్ల పాటు సేవలు అందించారు రమాకాంత్ దేశాయ్. వెస్టిండీస్ తో ఆడిన తొలి టెస్టులోనే 49 ఓవర్లలో నాలుగు వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. ఇక ఆ తర్వాత ఆస్ట్రేలియా న్యూజిలాండ్ వెస్ట్ ఇండీస్ ఇంగ్లాండ్ లలో  పర్యటించి భారత క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం కూడా వహించాడు రమాకాంత్ దేశాయ్. 1961 లో పాకిస్తాన్ పై జరిగిన సిరీస్లో ఏకంగా 21 వికెట్లు సాధించాడు. ముంబై టెస్టులో పదవ నెంబర్ బ్యాట్స్మెన్ గా  ప్రవేశించి  85 సాధించి సరికొత్త రికార్డును సృష్టించాడు రమాకాంత్ దేశాయ్. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన తర్వాత సెలక్షన్ కమిటీ చైర్మన్గా కూడా బాధ్యతలు చేపట్టారు.  ఈయన 1998 ఏప్రిల్ 28 వ తేదీన పరమపదించారు. 

 

 కుందూరు జనారెడ్డి జననం  : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు కుందూరు  జానారెడ్డి 1946 జూన్ 20వ తేదీన జన్మించారు. నల్గొండ జిల్లాలో జన్మించిన జానారెడ్డి.. ఎన్టీ రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1983లో పాలకుర్తి నియోజకవర్గం నుంచి తొలిసారి రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యారు జానారెడ్డి. అదే నియోజకవర్గం నుంచి ఆరు పర్యాయాలు శాసనసభకు ఎన్నికయ్యారు.. ఈయన ఎన్నో శాఖలకు మంత్రిగా కూడా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం మంత్రిగా కూడా పనిచేశారు జానారెడ్డి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో అత్యంత దీర్ఘకాలం మంత్రిగా పనిచేసిన వ్యక్తిగా జానారెడ్డి రికార్డును సృష్టించారు. 

 

 నీతూ చంద్ర జననం : భారతీయ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటి అయిన నీతూ చంద్ర 1984 జూన్ 20వ తేదీన జన్మించారు. మోడల్ గా తన కెరీర్ ని ప్రారంభించిన నీతూచంద్ర ఆ తర్వాత నటిగా బాలీవుడ్ చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించింది. కేవలం నటిగానే కాకుండా స్పోర్ట్స్ ఉమెన్ గా... టైక్వాండో లో బ్లాక్ బెల్ట్ హోల్డర్ కూడా ఆమెకు గుర్తింపు ఉంది. 2015 లో గరంమసాలా అనే సినిమా ద్వారా చిత్ర పరిశ్రమకు ఎంత అయింది నీతూ చంద్ర. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి ఎంతగానో గుర్తింపు సంపాదించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: