హెరాల్డ్ బర్త్ డే :10-06-2020 రోజున జన్మించిన ప్రముఖులు..?
జూన్ 10వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి చూస్తే ఎంతో మంది ప్రముఖులు జననాలు జరిగాయి మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి.
పొణకా కనకమ్మ జననం : సుప్రసిద్ధ సంఘసేవకురాలు అయిన పొణకా కనకమ్మ 1892 జూన్ 10వ తేదీన జన్మించారు. కొనక కనకమ్మ గొప్ప సంఘ సంస్కర్త ఉప్పుసత్యాగ్రహం లో పాల్గొన్న వారిలో మహిళల ఎక్కువ. అలాంటి మహిళలలో చెప్పుకోదగ్గ వ్యక్తిగా కనకమ్మ కీర్తిని సంపాదించారు. కేవలం కనకమ్మ మాత్రమే కాదు ఆమె కుటుంబ సభ్యులు మొత్తం ఉప్పు సత్యాగ్రహం లో పోరాటంలో పాల్గొన్నారు. అంతే కాకుండా ఖద్దర్ ప్రచారం కూడా చేశారు.
ఈవీవీ సత్యనారాయణ జననం : తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో ప్రసిద్ధిగాంచిన దర్శకుడు నిర్మాత అయిన v v SATYANARAYANA' target='_blank' title='ఈవివి సత్యనారాయణ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">ఈవివి సత్యనారాయణ 1958 జూన్ 10వ తేదీన జన్మించారు. ప్రముఖ దర్శకుడు జంధ్యాల ప్రియ శిష్యుడు ఈయన. అయితే వినోదభరితమైన సినిమాలను తెరకెక్కించడంలో ఈవివి సత్యనారాయణ సుప్రసిద్ధుడు అని చెప్పాలి. ఈయన మొదటి సినిమా రాజేంద్రప్రసాద్ కథానాయకుడిగా తెరకెక్కిన చెవిలో పువ్వు. అయితే ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ అంతగా విజయం సాధించలేదు. ఆ తరువాత కొద్ది కాలానికి నిర్మాత రామానాయుడు ప్రేమ ఖైది చిత్రంలో అవకాశం ఇచ్చారు. ఇక ఆ తర్వాత ఈ సినిమా ఘన విజయం సాధించడంతో దర్శకుడిగా మంచి గుర్తింపు వచ్చింది ఈ వి వి సత్యనారాయణకు . జంధ్యాల వరవడిలోనే ఎక్కువగా హాస్య ప్రధాన చిత్రాలను తెరకెక్కించే వారు ఈ వి వి సత్యనారాయణ. ముఖ్యంగా రాజేంద్రప్రసాద్తో ఎన్నో హాస్యభరితమైన సినిమాలను తెరకెక్కించి మంచి విజయాలను అందుకున్నాడు. తెలుగు చిత్ర పరిశ్రమలో కొత్త ట్రెండ్ సృష్టించిన జంబలకడిపంబ సినిమా కూడా ఈవీవీ సత్యనారాయణ తెరకెక్కించిందే. టాలీవుడ్ లో అగ్ర నటులైన చిరంజీవి నాగార్జున బాలకృష్ణ వెంకటేష్ లతో కూడా సినిమాలను తెరకెక్కించారు సత్యనారాయణ. ఇవివి సత్యనారాయణ దర్శకత్వం వహించిన సినిమాల్లో రంభ రచన ఊహ లాంటి హీరోయిన్లు కూడా పరిచయమయ్యారు. దాదాపు 50కి పైగా సినిమాలను తెరకెక్కించి ఎంతో గుర్తింపు సంపాదించారు ఈవి వి సత్యనారాయణ. ఇక ప్రస్తుతం ఇవివి సత్యనారాయణ తనయుడు నరేష్ హీరోగా తెలుగు చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్నాయి. తన కొడుకు నరేష్ తో కూడా ఎన్నో సినిమాలను తెరకెక్కించారు సత్యనారాయణ.
నందమూరి బాలకృష్ణను : నందమూరి బాలకృష్ణ తెలుగు ప్రేక్షకులకు ప్రజలకు సుపరిచితుడు. అన్నగారు సీనియర్ ఎన్టీఆర్ నట వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్నారు బాలకృష్ణ. కాగా బాలకృష్ణ 1960 జూన్ 10వ తేదీన జన్మించారు, కేవలం నటుడిగానే కాకుండా రాజకీయ నాయకుడిగా కూడా తన ప్రస్థానాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నారు బాలకృష్ణ. తెలుగు చిత్ర పరిశ్రమలో బాలకృష్ణకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. దాదాపుగా మూడు దశాబ్దాల నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా కొనసాగుతున్నారు బాలకృష్ణ. తన నట జీవితంలో ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో కూడా నటించారు. 1974 లో తాతమ్మకల ఈ సినిమా ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు బాలకృష్ణ ప్రస్తుతం హిందూపురం ఎమ్మెల్యేగా కూడా కొనసాగుతున్నాయి. ఇక ఆయన నటనకు గాను ఎన్నో అవార్డులు రివార్డులు సైతం అందుకున్నారు నందమూరి బాలకృష్ణ.
రాహుల్ సిప్లిగంజ్ జననం : తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నేపథ్య గాయకుడు అయిన రాహుల్ సిప్లిగంజ్ 1989 జూన్ 10వ తేదీన జన్మించారు. ముఖ్యంగా ఫోక్ పాటలు పాడటంలో రాహుల్ సిప్లిగంజ్ సుప్రసిద్ధుడు అనే చెప్పాలి. అయితే చిత్రపరిశ్రమకు పరిచయం కాకముందు ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తూ ఫోక్ సాంగ్స్ కి వెస్ట్రన్ టచ్ చే
ఇస్తూ.... ఎంతో మందిని ఆకర్షించాడు. ఆ తర్వాత సినిమాల్లో పాడే అవకాశాన్ని దక్కించుకుంది ఎంతో మంది ప్రేక్షకులను అలరించారు రాహుల్ సిప్లిగంజ్. ఆ తర్వాత బిగ్ బాస్ 3 లో కంటెస్టెంట్ గా వెళ్ళిన రాహుల్ సిప్లిగంజ్ ఏకంగా ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకోవడంతో పాటు టైటిల్స్ విన్నర్ గా కూడా నిలిచాడు. .