జుట్టు ఊడిపోతోందని భాధపడుతున్నారా..అయితే..

NCR

జుట్టు ఊడిపోతోందని భాదపడే వాళ్ళ సంఖ్య నానాటికి పెరిగిపోతోంది. రోజు వారి అలావాట్లు, సరైన, బలమైన ఆహారం తీసుకోవక పోవడం, జుట్టుపై శ్రద్ధ వహించక  పోవడం, కాలుష్యం , ఇలా అనేక కారణాలు జుట్టు రాలిపోవడానికి ముఖ్య భూమిక పోషిస్తాయి. కానీ జుట్టుకి బలమైన పోషకాలు ఇవ్వడం ద్వారా, సరైన సంరక్షణ చేపట్టడం ద్వారా జుట్టు రాలిపోయే ప్రమాదం నుంచీ కాపాడుకోవచ్చు మరి జుట్టుకి సంరక్షణ ఎలా చేపట్టాలి. ఎలాంటి పోషకాలు జుట్టుకు అందించాలి అనే విషయాలని ఇప్పుడు తెలుసుకుందాం..

 

జుట్టు తేమగా ఉన్నప్పుడు జుట్టుపై చుండ్రు వంటి సమస్యలు రావు, జుట్టు ఊడిపోవడం కూడా జరుగదు.కానీ చాలా మంది ఇంట్లో చేసుకునే న్యాచురల్ రెమిడీస్ తెలియక పోవడం వలన బ్యూటీ స్టోర్స్ లో దొరికే ఖరీదైన క్రీమ్స్ వాడుతూ, రసాయనిక క్రీమ్స్ ని జుట్టుకు పట్టించి ఇంకా ప్రమాదంలో పడుతూ ఉంటారు. సహజసిద్ధంగా జుట్టుని బలంగా ఎలా ఉంచుకోవాలి, తేమగా జుట్టు ఎలా అవుతుంది అంటే.

 

ఆలివ్ నూనె జుట్టు కుదుళ్ళకి రక్త ప్రసరణ చేసే విధంగా, తేమగా ఉండేలా చేస్తుంది. మరి ఆలీవ్ నూనేని జుట్టుకు ఎలా పట్టించాలంటే.  ఈ నూనేని గోరువెచ్చగా చేసి తలకు రాసి వేళ్ళతో కుదుళ్ళకి నూనె వెళ్ళేలా మసాజ్ చేయాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే చాలు మంచి ఫలితాల్ని పొందవచ్చు. అంతేకాదు కలబంద గుజ్జుని తీసుకుని బాగా మెత్తగా చేసి కుదుళ్ళకి పట్టించడం వలన కూడా సత్ఫలితాలని పొందవచ్చు.

 

అదేవిధంగా ఉల్లి రసంలో ఉండే యాంటీ సెప్టిక్ గుణాలు మీ జుట్టుని కాపాడుతాయి. ఇన్ఫెక్షన్లు వచ్చి జుట్టు పాడవకుండా చేయడంలో ఉల్లి రసం కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాదు జుట్టు కుదుళ్ళకి తేమని అందించి బలంగా  ఉంచడంలో ఉల్లి చేసే మేలు మరేది చేయదు అంటారు నిపుణులు.

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: