“వేసవి”లో ముఖం జిడ్డు కారకుండా..ఈ “చిట్కాలు” పాటించండి.

Bhavannarayana Nch

వేసవి కాలం వస్తే చాలు చాలా మందికి చెమటలు ఎక్కువగా పడుతూ ఉంటాయి..చాలా మందికి ముఖం పై ఎక్కువగా చెమటలు పడుతూ ముఖం జిడ్డు కారుతూ ఉంటుంది...బయటకి వెళ్ళాలంటే చాలు ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు.. అంతేకాదు అలా చెమట ఎక్కువగా పట్టే వారికి చెమట కాయలు ఎక్కువగా వస్తూ ఉంటాయి..వీటి వలన చర్మ మృదుత్వాన్ని కోల్పోతుంది అదేవిధంగా నల్లగా మారిపోతుంది..అలాంటి వారికోసం చిన్న చిన్న సింపుల్ చిట్కాలని పాటిస్తే సమస్య నుంచే దూరం అవ్వచ్చు..

 

ఉదయం స్నానం చేసేప్పుడు, రాత్రి పడుకునేటప్పుడే కొందరు ముఖం కడుగుతారు. అలా కాకుండా రోజులో మూడు నుంచి అయిదు సార్లు చల్లటి నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి...ఇలా చేయడం వలన  చర్మరంధ్రాల్లోని వేడిని తగ్గించడమే కాకుండా. ఎక్కువగా చెమట బయటికి రాదు..చర్మం ఎప్పుడు తాజాగా ఉంటుంది.

 

వేసవి కాలంలో చాలా మంది ఇంట్లో నుంచీ బయటకి వెళ్లి సమయంలో మామూలుగానే వెళ్ళిపోతారు కానీ కొన్ని జాగ్రత్తులు పాడించడం  వలన చర్మాన్ని కాపాడుకోవచ్చు...ఫేషియల్ స్వెట్టింగ్ తగ్గించుకోవడానికి మరో మంచి మార్గం ఐస్ ముక్కలు. వీటిని ఒక వస్త్రంలో చుట్టి... ముఖం మీద తరచూ మర్ధన చేసుకుంటూ ఉండాలి. చాలా హాయిగా ఉండడంతో పాటూ ఎక్కువ చెమట పట్టడం తగ్గుతుంది.

 

అంతేకాదు వేసవిలో ఉడుకు ఎక్కువగా ఉండటం వలన చెమట వాసన కూడా ఎక్కువగా వస్తూ ఉంటుంది అందుకోసం మీరు ఎక్కువగా నీటిని తీసుకోవడం మంచిది అంతేకాదు తాటి ముంజులతో చర్మాన్ని శుభ్రం చేసుకోవచ్చు..అంతేకాదు తాటి ముంజులని గుజ్జుగా చేసి దానిలో కొంత శనగ పిండి కలిపి పేస్ మాస్క్ లా పెట్టుకోవచ్చు కూడా ఇలా చేయడం వలన ముఖ్యం ఎంతో బిగుతుగా కూడా వస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: