కేటీఆర్‌.. మమ్మల్ని అంతమాట అంటావా.. నిన్ను కోర్టుల చుట్టూ తిప్పిస్తా చూడు?

Chakravarthi Kalyan
మాజీ మంత్రి కేటీఆర్‌పై ఎన్నికల కమిషన్‌కు కాంగ్రెస్‌ ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్ధి పల్లి బఠానీ అంటూ ప్రచారం చేయడాన్ని తీవ్రంగా పరిగణించిన పీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు మల్లు రవి కేటీఆర్‌పై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌ రాజ్‌కు ఫిర్యాదు చేశారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్ధి బిట్స్‌ పిలానీలో డిగ్రీ పూర్తి చేసినట్లు గొప్పలు చెప్పుకోవడం వరకు బాగానే ఉందన్న కాంగ్రెస్ నేత మల్లు రవి.. ఇతర కళాశాలల్లో డిగ్రీ పూర్తి చేసిన వారిని పల్లీ బఠానీ అని అవమానపరిచేట్లు వ్యాఖ్యలు చేయడం నియమావళి ఉల్లంఘన కిందకే వస్తుందని ఆయన ఆరోపించారు.
బిట్స్‌పిలాని-పల్లి బఠానిల మధ్య ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నట్లు కేటీఆర్‌ పేర్కొనడాన్ని కాంగ్రెస్ నేత మల్లు రవి తప్పుబట్టారు. ఈ విషయంలో ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకుని కేటీఆర్‌పై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేత మల్లు రవి విజ్ఞప్తి చేశారు. కేటీఆర్‌ అహంకార వ్యాఖ్యలు చేశారని.. దీని కోసం ఆయన కోర్టుల చుట్టూ తిరగక తప్పదని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ktr

సంబంధిత వార్తలు: