జుట్టు కుదుళ్ళు గట్టిపడటానికి..అద్భుతమైన చిట్కాలు

Bhavannarayana Nch

చలా మందికి జుట్టు పలుచ బడుతుంది..జుట్టు కుదుళ్ళు తేలికగా అయిపోతాయి..మెల్ల మెల్లగా జుట్టు రాలిపోయి బట్ట తల వచ్చే ప్రమాదం ఉంటుంది..అయితే జుట్టు ఊడిపోవడం ఎక్కువగా మహిళలలో జరుగుతూ ఉంటుంది.దీనికి అనేక రకాల కారణాలు ఉన్నాయి..నిద్రలేమి సమస్య నుంచీ..పౌష్టిక ఆహారలోపం వరకు  అనేక సమస్యలు కారణం అవుతాయి..అయితే జుట్టు మొదళ్ళకి మళ్ళీ పటుత్వాన్ని ఇవ్వాలి అంటే చాలా కష్టమైన పనే ఎదుకంటే పోషకవిలువలు ఒక్కసారి జుట్టు మీద ప్రాభవాన్ని చూపిన తరువాత అవి మాళ్ళీ తిరిగి జుట్టుని చేరుకోవాలి అంటే చాలా సమయం పడుతుంది.

 

అయితే చిన్న చిన్న చిట్కాల ద్వారా ఈ సమస్యకి చెక్ పెట్టచ్చు..అది కూడా సహజసిద్దమైన పద్దతులని అవలంభించి ఈ సమస్యని పరిష్కరించుకోవచ్చు..ఇంట్లో ఉండే పదార్ధాలని ఉపయోగించి ఈ సమస్యకి చెక్ పెట్టచ్చు..ఈ హోం రెమెడీస్ లో వివిధ రకాల విటమిన్స్, న్యూట్రీషియన్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వల్ల జుట్టు గట్టిపడి తిరిగి మరలా జుట్టు పునరుత్పత్తి అయ్యేలా చేస్తుంది.మరి ఈ సహజసిద్దమైన పద్దతులు ఏమిటో మీరు చుడండి.

 

జుట్టు కుదుళ్ళని బలంగా మార్చగలిగే శక్తి ఆలివ్ ఆయిల్ కి ఉంటుంది..దీనిలో ఉండే హై ప్రోటీన్స్ జుట్టుని ఎంతో బలంగా చేస్తాయి..కొంచం ఆలివ్ ఆయిల్ తీసుకుని పడుకునే ముందు తలకి పట్టించి..వేళ్ళతో జుట్టులోపల మసాజ్ చేయాలి మరుసటి రోజు ఉదయం కుంకుడు నీళ్ళతో కానీ..లేదంటే సహజసిద్ధమైన షాంపూ వాడి తలస్నానం చేయాలి ఇలా చేసేస్తే జుట్టు ఆరోగ్యంగా ఉంటుది.

 

అరటి పండు కూడా జుట్టుకి ఎంతో ఉపయోగకరం దీనిలో ఉండే పొటాషియం మెగ్నీషియం జుట్టు మోదళ్ళని బలంగా చేస్తాయి..అంతేకాదు జుట్టు ఎదుగుదలని మెరుగుపరుస్తుంది కూడా ఐతే దీనికోసం..బాగా పండిన అరటిపండును మెత్తగా మ్యాష్ చేసి, జుట్టు కుదుళ్ళకి పట్టించాలి..ఒక గంట తర్వాత తలస్నానం చేయాలి. ఈ రెమెడీని వారంకు ఒకసారి వాడితే మంచి ఫలితం ఉంటుంది.

అలాగే గ్రీన్ టీ నీటిని తలకి పట్టించి 30 నిమిషముల వరకూ అలా ఉంచి గోరువెచ్చని నీటితో శుభ్రంగా తలస్నానం చేయాలి..ఇలా వారానికి కనీసం 3 సార్లు ఇలా చేయాలి..గ్రీన్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స జుట్టు కుదుళ్ళ బలానికి ఎంతో ఉపయోగపడుతాయి.



 

 




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: