తీవ్రంగా ఊడిపోయే జుట్టుకు.."ఆయుర్వేద చిట్కా"...!!!

NCR

ప్రస్తుతం ఉన్న జీవన పరిస్థితులలో జుట్టు రాలడం అనేది సర్వ సాధారణం అయ్యిపోయింది. వయసుతో సంభంధం లేకుండా జుట్టు ఊడిపోతున్న వారు లక్షల సంఖ్యలో ఉన్నారంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఈ జుట్టు రాలు సమస్య ముఖ్యంగా మగవారిలో అధికంగా కనిపిస్తోంది.ఆడవారిలో కూడా ఈ ప్రభావం తీవ్రంగా మారడం ఎక్కువగా కనిపిస్తోంది. మరి ఈ సమస్యల  పరిష్కారానికి మన పూర్వీకులు అనుసరించిన కొన్ని ఆయుర్వేద చిట్కాలని ఒక్కసారి పరిశీలించి ఆచరిద్దాం..

 

జుట్టు రాలిపోవడం అనగానే మన ఇంట్లో ఉండే బామ్మలు చెప్పేది శీకాయ పొడి రాయమని, లేదా కుంకుడు కాయతో తలంటు పోసుకోమని, మందార పువ్వులతో నూనెను చేసుకుని వాడమని చెప్తూ ఉంటారు. గతంలో ఈ పద్దతులని ఎవరూ పాటించలేదు కానీ ప్రస్తుత పరిస్థితులలో మార్కెట్ లోకి పాతతరం పద్దతులే కొత్తగా వస్తుంటే రూపాయి ఎక్కువ పెట్టి మరీ తెచ్చుకుంటున్నారు. మరి వాటినే మనం ఇళ్ళలో మరింత స్వచ్చంగా తయారు చేసుకోవచ్చు.

 

శీకాయలు కొన్ని తీసుకుని మెత్తగా పొడి చేసుకుని , జుత్తుకి పట్టించి ఒక అరగంట తరువాత స్నానం చేస్తే జుట్టు బిగుతుగా, ధృడంగా తయారవుతుంది . ఇలా వారానికి ఒక సారి తప్పకుండా తలంటు సీకాయతో చేస్తే ఉత్తమ ఫలితం పొందవచ్చు.

 

ఉసిరికాయాలని పేస్ట్ చేసి దానిలో కొంత రోజ వాటర్ కలిపి అరగంట తరువాత తల స్నానం చేస్తే తప్పకుండా మంచి ఫలితాల్ని పొందవచ్చు.

 

కలబంద కూడా జుట్టు రాలకుండా చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. తాజా కలబంద గుజ్జుని తీసుకుని దానిలో కొంత ఉసిరి రసం కలిపి తలకి పట్టించడం వలన జుట్టు అడుగు భాగం లో చుండ్రు పోవడమే కాకుండా వెంట్రుకలు బలంగా తయారవుతాయి. ఇలా ఎలాంటి పద్దతిని పాటించినా సరే మార్కెట్  లో దొరికే వస్తువులతో కాకుండా సహజ సిద్దంగా తయారు చేసుకుని వాడటం వలన ఉత్తమ ఫలితాలు పొందుతారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: