"చంకల్లో దుర్వాసన"...పోగొట్టే సహజసిద్దమైన పద్ధతి...!!!

NCR

చాలా మంది తరుచూ పడే సమస్య చంకలలో దుర్వాసన రావడం. ఈ సమస్య ఉన్న వాళ్ళు ఎంతగా ఇబ్బంది పడతారంటే ఎవరి పక్కన అయినా కూర్చోవాలన్నా సరే ఒక్క నిమిషం కూడా ఉండలేని పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది. మన నుంచీ దుర్వాసన వస్తుంది అనుకుంటే మన స్నేహితులు కూడా దూరంగానే ఉంటారు. అయితే ఈ దుర్వాసనలకి కారణాలు అనేకం ఉంటాయి.

 

అయితే ఈ దుర్వాసన నుంచీ తప్పించుకోవడానికి చాలా మంది బాడీ స్ప్రే లు వాడుతూ ఉంటారు అయితే చాలా మంది ఇవి పడకపోవడంతో మరిన్ని సమస్యలు కొని తెచ్చుకుంటారు. అయితే ఇలాంటి ఇబ్బందులు లేకుండా వంటింట్లోనే ఉండే వంట పదార్ధాలతో చక్కని పరిష్కారాలు చేసుకోవచ్చు. అసలు చంకలలో దుర్వాసన ఎందుకు కలుగుతుందంటే.

 

చంకల దుర్వాసన అనేకరకాల కారణాల ద్వారా రావచ్చు. చర్మంపై బాక్టీరియా పెరగడం వలన చంకల్లో దుర్వాసన వస్తుంది ఆలాగే  దుస్తుల వాడకం వలన కూడా ఈ రకమైన ప్రభావం చూపిస్తుంది. స్వేద గంధ్రులు అధికంగా ఉండటం వలన, ఆహార ప్రణాళిక పాటించక పోవడం వలన కూడా ఈ రకమైన ఇబ్బందులు వస్తాయి. అయితే ఇప్పుడు చంకలలో దుర్వాసన పోవడానికి సహజసిద్దమైన పద్దతులు ఎలా పాటించాలని వివరాల్లోకి వెళ్తే..



కలబంద గుజ్జుతో ఈ సమస్యకి చెక్ పెట్టచ్చు. సహజసిద్ధంగా ఈ పద్దతిని వాడటం వలన సైడ్ ఎఫెక్ట్ వస్తుందనే భయం కూడా ఉండదు. అయితే గుజ్జుతో దుర్వాసన పోగొట్టే పద్దతిని పరిశీలిస్తే. ముందుగా  2 టేబుల్ స్పూన్ల కలబంద గుజ్జు  అలాగే  1 టేబుల్ స్పూన్ తేనె తీసుకోవాలి. సేకరించిన కలబంద గుజ్జు లో కొంచం తేనే కలిపి చంకల భాగంలో సుమారు 30 నిమిషాలు ఉంచాలి. ఆ తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి 3 సార్లు ఈ పద్దతిని పాటిస్తే తప్పకుండా చంకల్లో దుర్వాసన పోయి అందరిలో సంతోషంగా తిరిగేయచ్చు.

 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: