శరీర భాగాల్లో చర్మం నలుపు ఈజీగా తగ్గే టిప్స్?

Purushottham Vinay
మెడ చుట్టూ, నుదుటి భాగం, చెంపలు వంటి భాగాల్లో చర్మం నల్లగా ఉన్నవారు ఇప్పుడు చెప్పే టిప్స్ పాటిస్తే ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది. ప్రతి రోజూ నీటిని ఎక్కువగా తాగాలి. రోజూ 4 నుండి5 లీటర్ల నీటిని తాగడం మంచిది. అలాగే బరువు తగ్గడానికి, షుగర్ వ్యాధి అదుపులో రావడానికి గాను ఆహార నియమాలను మార్చుకోవాలి. ఉదయం పూట వెజిటేబుల్ జ్యూస్ ను తీసుకోవాలి. చర్మం నలుపు పోవాలంటే విటమిన్ ఎ, సి ఉండే ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి. అలాగే షుగర్ వ్యాధి అదుపులోకి రావడానికి గానూ లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండే ఆహారాలను తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధి అదుపులోకి రావడంతో పాటు బరువు కూడా తగ్గుతారు. శరీరంలో హార్మోన్లు చక్కగా ఉత్పత్తి అవుతాయి. మధ్యాహ్నం పూట రెండు పుల్కాలను ఎక్కువ కూరతో తీసుకోవాలి. సాయంత్రం సమయంలో విటమిన్ సి ఎక్కువగా ఉండే నారింజ, బత్తాయి పండ్ల రసాన్ని తీసుకోవాలి. ఇక సాయంత్రం 6 గంటల లోపు కేవలం పండ్లను, అలాగే నానబెట్టిన నట్స్ మాత్రమే ఆహారంగా తీసుకోవాలి.


ఇలా ఆహార నిమయాలను పాటించడం వల్ల 4 నుండి 5 నెలల్లోనే చర్మం తిరిగి సాధారణ స్థితికి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.స్త్రీల్లలో వచ్చే పిసిఒడి సమస్య కారణంగా మెడ చుట్టూ, ముఖ భాగాల్లో చర్మం నల్లగా మారిపోతూ ఉంటుంది. ఇక నాలుగవది హైపో థైరాయిడిజం. హైపో థైరాయిడిజంలో వచ్చే హార్మోన్ల అసమతుల్యత కారణంగా చర్మం నల్లగా మారిపోతుంది. చాలా మంది షుగర్ వ్యాధితో బాధపడుతున్నప్పటికి దానిని గుర్తించలేకపోతూ ఉంటారు. దీంతో వారిలో ఇన్సులిన్ నిరోధకత పెరిగి చర్మం నల్లగా మారిపోతూ ఉంటుంది. ఇన్సులిన్ నిరోధకత కారణంగా చర్మం కింద ఉండే మెలనోసైట్స్ మెలనిన్ ను ఎక్కువగా ఉత్పత్తి చేస్తాయి. మెలనిన్ ఎక్కువగా ఉత్పత్తి అవ్వడం వల్ల చర్మం నల్లగా మారిపోతూ ఉంటుంది. చాలా మంది ఈ సమస్య నుండి బయటపడడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అనేక రకాల క్రీములను, లోషన్ లను వాడుతూ ఉంటారు. అయినప్పటికి కూడా ఎటువంటి ఫలితం ఉండదు. అయితే ఇలా మెడ చుట్టూ చర్మం నల్లగా ఉన్నవారు రసాయనాలు కలిగిన క్రీములకు బదులుగా ఈ చిట్కాలను పాటించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: