పాదాల పగుళ్లు చిటికెలో తగ్గే టిప్స్?

Purushottham Vinay
మనకు చలికాలంలో వచ్చే చర్మ సమస్యల్లో మడమల పగుళ్ల సమస్య కూడా ఒకటి. చలి వల్ల చాలా మందికి పాదాలకు పగుళ్లు వస్తుంటాయి. ఈ పగుళ్ల వల్ల పాదాల్లలో మంటలు, నొప్పులు విపరీతంగా వస్తూ ఉంటాయి.అందువల్ల నడవాలన్నా కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎక్కువ సేపు నిల్చోలేరు. ఈ పగుళ్ల వల్ల కొంత మందిలో వాపు కూడా వచ్చేస్తుంది. అయితే వీటికి ముందుగానే చికిత్స అందించకపోతే.. దీర్ఘకాలిక సమస్యలు ఎదురయ్యే సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే మన ఇంట్లోనే ఉండే కొన్ని రకాల పదార్థాలను ఉపయోగించి ఈ పగళ్ల సమస్యల నుంచి ఈజీగా ఉపశమనం పొందవచ్చు. చలి కాలంలో వచ్చే పగుళ్ల సమస్యకు చెక్ పెట్టేలా ఇంట్లోనే హోమ్ మేడ్ హీల్ క్రాక్ క్రీమ్ తయారు చేసుకోవచ్చు. మరి ఈ క్రీమ్ ని ఎలా తయారు చేసుకుంటారు? అందుకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.


హోమ్ మేడ్ హీల్ క్రాక్ క్రీమ్ కి కావాల్సిన పదార్థాల విషయానికి వస్తే..ఆవాల నూనె  2 స్పూన్లు, కొబ్బరి నూనె  2 స్పూన్లు, వాసెలీన్, విటమిన్ ఇ క్యాప్సూల్స్  ఒక స్పూన్, కర్పూరం అర టీ స్పూన్ తీసుకోవాలి .హోమ్ మేడ్ హీల్ క్రాక్ క్రీమ్ తయారీ విధానం విషయానికి వస్తే..ఒక చిన్న పాత్ర తీసుకుని అందులో పైన చెప్పిన క్వాంటిటీ ప్రకారం కోకోనెట్ ఆయిల్, ఆవాల నూనెని తీసుకోవాలి. తరువాత ఈ రెండింటినీ బాగా కలుపు కోవాలి. ఇక ఇందులోనే కర్పూరం కూడా వేసి మెత్తగా అయ్యేలా మిక్స్ చేసుకోవాలి.తరువాత ఇప్పుడు ఇదే మిశ్రమంలో వాసెలీన్, విటమిన్ ఇ క్యాప్సూల్స్ కూడా కలిపి పక్కన పెట్టుకోవాలి.ఆ తరువాత వీటన్నింటినీ కూడా బాగా కలుపుకుని.. ఈ క్రీమ్ ని డబుల్ బాయిలింగ్ చేసుకోవాలి. ఇక ఈ మిశ్రమం పూర్తిగా చల్ల బడ్డాక.. మడమలకు రాసుకుంటే ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ఓ గాజు సీసాలో నింపుకుని ఫ్రిజ్ లో స్టోర్ చేసుకోవచ్చు. ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు రాసుకుంటే మడమల పగుళ్లు చాలా ఈజీగా వారం రోజుల్లో తగ్గి పోతాయి.ఇంకా మడమల నొప్పులు, వాపులు కూడా ఈజీగా తగ్గుముఖం పడతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: