చర్మం, జుట్టు పోషణకు ఈ పాలు చాలా మంచివి?

Purushottham Vinay
మన ముఖంపై మొటిమల మచ్చలను వదిలించుకోవడానికి కొబ్బరి పాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. కొబ్బరి తురుము నుంచి మనం పాలని తయారు చేయవచ్చు.చర్మం, జుట్టు సంరక్షణలో కొబ్బరి పాలు ఖచ్చితంగా ప్రత్యేక పాత్ర పోషిస్తాయి.అలాగే కొబ్బరి పాలలో అధిక మొత్తంలో సంతృప్త కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇందులో విటమిన్ సి, బి ఇంకా ఇ కూడా పుష్కలంగా ఉన్నాయి. ఈ పాలలో కాపర్, సెలీనియం, ఐరన్ ఇంకా మెగ్నీషియం వంటి ఖనిజాలు లభిస్తాయి.కాబట్టి ఇది జుట్టు, చర్మ సమస్యలను చాలా సులభంగా తొలగిస్తుంది.ఇంకా అలాగే ఈ కొబ్బరి పాలలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇవి చర్మాన్ని ఇన్ఫెక్షన్ నుంచి కాపాడతాయి. ఇంకా అలాగే సహజమైన క్లెన్సర్‌గా పనిచేస్తుంది. కొబ్బరి పాలను తీసుకొని వాటిని మీ ముఖానికి పట్టించాలి. ఆ తర్వాత తడి టవల్‌తో ముఖాన్ని బాగా తుడుచుకోవాలి.


కొబ్బరి పాలలో తేనె, బాదం ముద్ద ఇంకా ముల్తానీ మట్టి కలిపి చర్మానికి రాసుకోవచ్చు. ఒక 20 నిమిషాల పాటు అలాగే ఉంచి ముఖం బాగా కడుక్కోవాలి. ఈ ఫేస్ ప్యాక్ ముడతలు, మొటిమలు ఇంకా మచ్చలను తొలగిస్తుంది.ఇంకా అలాగే జుట్టు పెరుగుదలకు కూడా కొబ్బరి పాలు ఉపయోగపడతాయి. కొబ్బరి పాలను తలస్నానంకి ముందు తలకు బాగా పట్టించాలి. ఐదు నిమిషాలు అలాగే ఉంచి ఆ తర్వాత శుభ్రంగా తలస్నానం చేయాలి. కొబ్బరి పాలు సహజమైన హెయిర్ కండీషనర్‌గా పనిచేసి జుట్టును ఎంతో మృదువుగా చేస్తుంది.అలాగే కొబ్బరి పాలు  వడదెబ్బ నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ఎండలో కమిలిపోయిన చర్మంపై కొబ్బరి పాలను అప్లై చేస్తే స్కిన్ ఇన్ఫ్లమేషన్ తగ్గించి, చర్మానికి ఇది చల్లదనాన్ని అందిస్తుంది.  కొబ్బరి పాలలో ఉండే యాంటీబ్యాక్టీరియల్ గుణాలు మొటిమల సమస్యలను ఈజీగా దూరం చేస్తాయి.కాబట్టి ఖచ్చితంగా ఈ కొబ్బరి పాలని వాడండి. ఎల్లప్పుడూ చర్మాన్ని అందంగా ఇంకా అలాగే ఎంతో ఆరోగ్యంగా ఉంచుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: