ఈ టిప్స్ తో ముఖంపై మచ్చలన్నీ మాయం?

Purushottham Vinay
కొంతమందికి ముఖంపై చాలా మొటిమలతో మచ్చలు ఇంకా పుట్టుమచ్చలు ఉంటాయి. ఇవి చూడ్డానికి చాలా అసహ్యంగా ఉండటంతో నలుగురిలో కలవలేక ఇబ్బంది పడిపోతుటారు. పుట్టు మచ్చలు అయితే కొందరికి ఇవి బ్యూటీ స్పాట్‌గా ఉంటాయి.మరికొందరికేమో ఈ పుట్టుమచ్చలు ముఖం అంతా ఉండి చూడటానికి చాలా వికారంగా కనిపిస్తుంటాయి. ఈ పుట్టుమచ్చలను ఇంకా మొటిమలతో కూడిన వదిలించుకోవాలనుకునే వారు ఈ కింది చిట్కాలను ఫాలో అయితే వాటిని చిటికెలో మాయం చేసేయొచ్చు. అవేంటో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం.వెల్లుల్లిని ముఖానికి రాసుకోవడం వల్ల ముఖంపై మచ్చలను వదిలించుకోవచ్చు. వెల్లుల్లిని ముఖానికి రాసుకుంటే ఏ మచ్చ రంగు అయిన పలచబారుతుంది. ఇంకా పూర్తిగా తొలగిపోతుంది కూడా. ఈ వెల్లుల్లిని రోజూ అప్లై చేయకుండా కొన్ని రోజులు వ్యవధి ఇస్తూ అప్లై చేస్తే ఫలితం ఉంటుంది.ఇంకా అలాగే బంగాళాదుంప రసం ముఖ సౌందర్యానికి ఖచ్చితంగా చాలా మంచి చేస్తుంది. 


ఈ బంగాళదుంప రసాన్ని ముఖంపై అప్లై చేయడం వల్ల ఆ మచ్చలు ఈజీగా తగ్గి ముఖం కాంతివంతంగా మారుతుంది. ముట్టుమచ్చలపై బంగాళదుంప రసాన్ని పూసి వాటిని తేలికగా తొలగించుకోవచ్చు.ఇంకా తేనె - నిమ్మరసం ఈ రెండింటిలో చర్మానికి మేలు చేసే పోషకాలు చాలా ఉంటాయి. నిమ్మకాయ రసాన్ని తేనెతో కలిపి పుట్టుమచ్చలపై రాస్తే మచ్చలు మాయమవుతాయి. మీరు ఈ చిట్కాను రోజుకు ఎన్ని సార్లు అయినా కూడా ట్రై చేయవచ్చు.అలాగే అయోడిన్ వల్ల కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ముఖం మీద మచ్చలను వదిలించుకోవాలనుకునే వారు అయోడిన్ ని ఉపయోగించవచ్చు. ఈ అయోడిన్‌ను మితంగా ఉపయోగించడం వల్ల మచ్చలు ఈజీగా మాయమవుతాయి.ఈ టిప్స్ పాటిస్తూనే ప్రతి రోజూ ఎక్కువగా ఎక్కువగా నీళ్లు తాగండి. ఖచ్చితంగా చాలా మంచి ఫలితం ఉంటుంది. ముఖం పై ఎలాంటి మచ్చలు ఉండవు. ఈ టిప్స్ కేవలం మచ్చలు తొలగించడానికే కాదు అందంగా మారడానికి కూడా ఉపయోగపడతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: