ముఖంపై మచ్చలు, ముడతలు లేకుండా ఉండాలంటే?

Purushottham Vinay
అరటిపండు తొక్కలు మన ముఖాన్ని మచ్చ లేకుండా చేయడానికి దివ్యౌషధంలా పనిచేస్తాయి. అరటిపండు తొక్కను నేరుగా మన ముఖంపై కూడా రాసుకోవచ్చు. ఈ తొక్కలో విటమిన్ సి ఇంకా యాంటీ-ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇక అవి ముడతలను తొలగించడంలో ప్రభావవంతంగా ఉంటాయి. అరటిపండు తొక్కను ముఖానికి రాసుకుంటే కళ్ల కింద నల్లటి వలయాలు కూడా ఈజీగా పోతాయి.అరటి తొక్కతో తయారు చేసిన ఫేస్ ప్యాక్‌లు ముఖంలోని మలినాలను తొలగించడంలో చాలా బాగా పని చేస్తాయి.అందుకోసం, ఒక గిన్నెలో అరటి తొక్కలను తీసుకొని వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. అలాగే అందులో ఒక చెంచా పంచదార, ఒక చెంచా తేనె, 2 చిటికెల పసుపు వేసి పేస్ట్‌లాగా చేసుకోవాలి. దీని తర్వాత ఫేస్ మీద 15 నుండి 20 నిమిషాల పాటు ఉంచిన తర్వాత శుభ్రంగా కడగాలి. ఇలా చేయడం వల్ల ఫేస్ లోని మృతకణాలు, నల్లటి వలయాలు చాలా ఈజీగా తొలగిపోతాయి.చక్కటి ఫేస్ ప్యాక్ కోసం అరటిపండు తొక్కను తీసుకుని మెత్తగా చేయాలి. దీని తర్వాత అందులో 2 చెంచాల పెరుగు ఇంకా ఒక చెంచా తేనె కలపండి. ఇలా తయారు చేసుకున్న ఫేస్ ప్యాక్ ను మొఖం ఇంకా మెడపై బాగా అప్లై చేయండి.


సుమారు ఒక 20 నిమిషాల తరువాత, తేలికపాటి చేతితో శుభ్రంగా కడగాలి. ఇక ఈ ఫేస్ ప్యాక్ ముడతలను తగ్గించడంలో,తెరుచుకున్న రంధ్రాలను తగ్గించడంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది.చాలా మంది కూడా అరటిపండు తిన్న తర్వాత తొక్కను పారేస్తారు. అయితే దాన్ని పారేయడానికి బదులుగా ఇలా  ఫేస్ ప్యాక్ తయారు చేసి మీ చర్మానికి ఉపయోగించవచ్చు. కొవ్వు ఆమ్లాల పరిమాణం అనేది అరటి తొక్కలలో కనిపిస్తుంది.  వాటిలో విటమిన్ ఎ, జింక్, మాంగనీస్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఇంకా యాంటీ ఏజింగ్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరంలోని టాక్సిన్స్‌ని తొలగించడంలో బాగా సహాయపడతాయి.ఇంకా అలాగే, ఇందులోని పొటాషియం రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇంకా అలాగే మచ్చలను తగ్గించడంలో సహాయపడుతుంది.విటమిన్ ఎ, బి, సి ఇంకా ఫైబర్ అధికంగా ఉండే అరటి తొక్కలు చర్మం, జుట్టుకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఫ్రీ రాడికల్స్ సమస్యను తొలగించడంలో ఇంకా అన్ని రకాల నష్టాలను నయం చేయడంలో కూడా బాగా సహాయపడతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: