వెంటనే మృతకణాలు తొలగాలంటే ఈ సింపుల్ చిట్కా మీకోసమే..!
సాధారణంగా మన ముఖము మరియు ఇతర భాగాలపై మృతకణాలు పేరుకు పోవడానికి కారణం,మన శరీరంలోని అధిక కొలెస్ట్రాల్ మరియు తగినంత నీరు తాగకపోవడమేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. కావున ముందుగా తగిన సమయాల్లో సరైన ఆహారం తీసుకొని మన ఆరోగ్యాన్ని దెబ్బ తినకుండా చూసుకోవాలి.అధిక నీరు తాగడం వల్ల మన శరీర ఆరోగ్యం బాగుపడటమే కాకుండా చర్మ ఆరోగ్యం కూడా చాలా మెరుగుపడుతుంది.
బియ్యం పిండితో చిట్కా..
దీనికోసం రెండు ఒక గిన్నె తీసుకొని అందులో రెండు టీ స్పూన్ల బియ్యం పిండి, ఒక స్పూన్ తేనె,ఐదారు చుక్కల నిమ్మరసం వేసి బాగా కలపాలి.ఇలా కలిపిన మిశ్రమాన్ని ఒక అరగంట సేపు అలాగే ఉంచాలి.ఆ తరువాత అరటి పండు తొక్క తీసుకొని,ఆ మిశ్రమాన్ని అద్ధి,మృత కణాలు ఎక్కడెక్కడ పేరుకు పోయాయో అక్కడ అంతా మెల్లగా మర్దన చేయాలి.ఇలా 10 నుంచి 15 నిమిషాలు రుద్ది అరగంటసేపు ఆరనివ్వాలి.ఆ తరువాత ఎలాంటి సోపులు వాడకుండా ముఖాన్ని శుభ్రం చేసుకుని, మాయిశ్చరైజర్ రాయాలి.ఇలా వారానికి మూడు నుంచి నాలుగు సార్లు చేసుకోవడం వల్ల మృతకణాలు తొందరగా తగ్గిపోతాయి.మరియు తక్కువ ఖర్చు కూడా..
ఇందులో వాడిన బియ్యం పిండిలో బి విటమిన్ అధికంగా ఉండడం వల్ల,మృత కణాలు తొందరగా తొలగిపోతాయి.కావున ప్రతి ఒక్కరూ ఈ చిట్కా ప్రయోగించి మంచి ఫలితాలను పొందడమే ఆలస్యం.