జుట్టు పొడవుగా పెరగాలంటే ఈ టిప్ పాటించండి?

Purushottham Vinay
పొడవాటి జుట్టు కావాలనే కోరిక అందరికి కూడా ఉంటుంది. కానీ ఇప్పుడు చెప్పబోయే సింపుల్ టిప్ ని పాటిస్తే ఖచ్చితంగా మీ కోరిక నెరవేరుతుంది. ఈ టిప్ మీ జుట్టు ఒత్తుగా పెరగడానికి చాలా అద్భుతంగా సహాయపడుతుంది. మరి ఆ టిప్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.ముందుగా మీరు ఒక ఉల్లిపాయను తీసుకొని దాని పీల్ తొలగించి వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇక ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ ని మీరు పోయాలి. ఇక ఆ వాటర్ హీట్ అవ్వగానే అందులో ఒక టేబుల్ స్పూన్ అవిసె గింజలు ఇంకా అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి ఒక పది నిమిషాల పాటు అలాగే మరిగించాలి. ఇక ఆ తర్వాత స్టైనర్ సహాయంతో థిక్ జెల్లీ స్ట్రక్చర్ జ్యూస్ ను మీరు సపరేట్ చేసుకోవాలి.ఇక ఈ జ్యూస్ పూర్తిగా చల్లారిన తరువాత ఒక టేబుల్ స్పూన్ ఆముదం, ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసుకుని అన్ని కలిసేలా బాగా మిక్స్ చేస్తే మంచి హెయిర్ సీరం రెడీ అవుతుంది.


ఈ సీరం ను స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి ఒకటికి రెండు సార్లు అప్లై చేసుకుని షవర్ క్యాప్ ని ధరించాలి. ఒక రెండు గంటల తరువాత మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒక్కసారి ఈ విధంగా చేస్తే జుట్టుకు మంచి పోషణ అనేది అందుతుంది. కుదుళ్ళు చాలా దృఢంగా మారుతాయి. ఇంకా అలాగే హెయిర్ గ్రోత్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. జుట్టు రాలడం కూడా ఈజీగా తగ్గుతుంది. ఇంకా అదే సమయంలో ఎంత సన్నగా చిన్నగా ఉన్న జుట్టు అయినా సరే కొద్ది రోజుల్లోనే ఈజీగా ఒత్తుగా పొడుగ్గా మారుతుంది. కాబట్టి పొడవాటి జుట్టు కావాలని ఆశ పడుతున్న వారు తప్పకుండా ఈ సింపుల్ న్యాచురల్ హోమ్ టిప్ ని పాటించండి. ఖచ్చితంగా మంచి ఫలితం మీ సొంతం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: