కొబ్బరి నూనెతో ఇలా చేస్తే మెరిసే అందం మీ సొంతం?

Purushottham Vinay
కొబ్బరి నూనె
తో ఇలా చేస్తే మెరిసే అందం మీ సొంతం?
రాత్రిపూట ముఖంపై ఉంచినప్పుడు ఇది గొప్ప బాడీ మాయిశ్చరైజర్‌గా పని చేస్తుంది. కొబ్బరి నూనె శరీరానికి అప్లై చేయడం వల్ల కూడా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ప్రతి ఇంట్లో జుట్టు బలానికి కొబ్బరి నూనెను అప్లై చేస్తుంటారు. కానీ దీన్ని ముఖంపై అప్లై చేయడం వల్ల కూడా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. కొబ్బరినూనెలో అలోవెరా జెల్, నిమ్మకాయ, మిక్స్ చేసి ముఖానికి పట్టించి, దానితో ముఖాన్ని కొన్ని నిమిషాల పాటు మసాజ్ చేయాలి. ఇప్పుడు ముఖం మీద రాత్రంతా అలాగే ఉంచండి. ఉదయాన్నే లేచి, శుభ్రమైన నీటితో మీ ముఖాన్ని శుభ్రం చేసుకోండి. ఇలా చేయడం వల్ల మీ ముఖంలోని మొటిమల మచ్చలు తొలగిపోతాయి. కొబ్బరి నూనె చర్మంలో కొల్లాజెన్ ను పెంచడం ద్వారా ముడతలను తగ్గిస్తుంది.కొబ్బరి నూనెను ఉపయోగించడం వల్ల చర్మం, జుట్టుకు అనేక రకాలుగా మేలు జరుగుతుంది. కొబ్బరి నూనె చర్మ సమస్యలను దూరం చేస్తుంది. దీనిలో ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీ ఫంగల్, యాంటీఆక్సిడెంట్, యాంటీవైరల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. దీన్ని ఉపయోగించడం వల్ల చర్మంపై ఉండే హానికరమైన బ్యాక్టీరియా తొలగిపోతుంది.


దీనితో పాటు ఇది మీ ముఖంలోని మృతకణాలను తొలగించడంలో కూడా సహాయపడుతుంది. ఇది చర్మాన్ని లోతుగా శుభ్రపరచడానికి, చర్మాన్ని సహజంగా మాయిశ్చరైజింగ్ చేయడానికి పనిచేస్తుంది. ఇది చర్మంపై మొటిమలను కూడా నియంత్రిస్తుంది. చర్మపు మచ్చలను తొలగిస్తుంది.కొబ్బరి నూనెను ఉపయోగించడం ప్రతి ఒక్కరికి ప్రయోజనకరంగా ఉండదు. దాని ఉపయోగం వల్ల కొన్ని నష్టాలు కూడా రావచ్చు. సున్నితమైన చర్మంపై కొబ్బరి నూనెను ఉపయోగించడం హానికరం. కొబ్బరికీ అలర్జీ ఉన్నవారిలో కొబ్బరి నూనెకు అలర్జీ సమస్య కూడా ఉండవచ్చు. లారిక్ యాసిడ్ ఉండటం వలన, బ్రెస్ట్ కు అప్లై చేసినప్పుడు తల్లి పాలు తాగే శిశువులలో ఇది అలర్జీ ప్రతి చర్యలకు కారణమవుతుంది. కొబ్బరి నూనె అధిక మొత్తంలో ఉండటం వల్ల చర్మం జిగటగా, జిడ్డుగా మారుతుంది.కాబట్టి మీ చర్మ తీరుని బట్టి కొబ్బరినూనె వాడండి. జిడ్డు చర్మం ఉన్నవారు అస్సలు కొబ్బరినూనె వాడవద్దు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: