తెల్ల జుట్టు శాశ్వతంగా నల్లగా మార్చే ఆకు పసరు!

Purushottham Vinay
తెల్ల జుట్టు సమస్య అనేది ప్రస్తుతం చాలా మందిని కూడా చాలా ఇబ్బందులకు గురి చేస్తోంది. వయస్సు తక్కువగానే ఉన్నప్పటికీ కూడా కొంతమందికి జుట్టు తెల్లగా అవుతుంటుంది.ఇందుకు చాలా కారణాలు ఉంటాయి. అయితే కారణాలు ఏమున్నప్పటికీ ఇలా జుట్టు తెల్లగా ఉంటే అసలు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. నలుగురిలోనూ తిరగాలన్నా ఇంకా బయటకు వెళ్లాలన్నా.. చాలా ఇబ్బందిగా ఫీలవుతుంటారు. దీంతో మార్కెట్‌లో దొరికే రకరకాల హెయిర్ డైలను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. వీటిని వాడడం వల్ల తెల్ల జుట్టు అనేది నల్లగా మారుతుంది. కానీ పలు సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. కాబట్టి వీటికి బదులుగా సహజసిద్ధమైన పదార్థాలతో తయారు చేసిన మిశ్రమాన్ని వాడాలి. అప్పుడు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండానే జుట్టును సహజసిద్ధంగా ఇంకా నల్లగా మార్చుకోవచ్చు. ఇక అందుకు ఏం చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.మన చుట్టూ పరిసరాల్లో బిళ్ల గన్నేరు మొక్కలు బాగా పెరుగుతుంటాయి. ఇక ఇవి పింక్ లేదా తెలుపు రంగులో పూలను పూస్తుంటాయి. అయితే పింక్ రంగులో ఉండే బిళ్ల గన్నేరు మొక్క ఆకులను మనం సేకరించాలి. ఇవి జుట్టును బాగా నల్లగా మారుస్తాయి. వీటిల్లో ఉండే పలు బయో యాక్టివ్ సమ్మేళనాలు జుట్టుపై మంచి ప్రభావం చూపిస్తాయి. దీంతో తెల్ల జుట్టు బాగా నల్లగా మారుతుంది. కనుక బిళ్ల గన్నేరు మొక్క ఆకులను సేకరించి వాటిని కడిగి శుభ్రం చేసి వాటి నుంచి రసాన్ని తీయాలి. ఇక ఈ రసాన్ని రెండు టీస్పూన్ల మోతాదులో తీసుకోవాలి.


ఇక బిళ్ల గన్నేరు మొక్క ఆకుల రసంని తీశాక.. అందులో ఒక నిమ్మకాయ నుంచి రసాన్ని బాగా పూర్తిగా తీసి కలపాలి. ఆ తరువాత ఆ మిశ్రమంలోనే ఒక టీస్పూన్ కొబ్బరినూనెను కూడా కలపాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపిన తరువాత జుట్టు కుదుళ్లకు పట్టేలా బాగా మర్దనా చేయాలి. ఒక 5 నిమిషాల పాటు ఈ మిశ్రమాన్ని జుట్టుకు రాయాలి. తరువాత ఒక గంట దాకా అలాగే ఉండాలి.ఆ తరువాత తలస్నానం చేయాలి. ఇక ఇలా వారంలో కనీసం రెండు సార్లు చేయాలి. దీంతో తెల్ల జుట్టు బాగా నల్లగా మారుతుంది. అలాగే ఇతర జుట్టు సమస్యలు కూడా చాలా ఈజీగా తగ్గుతాయి.బిళ్ల గన్నేర మొక్క ఆకుల్లో ఉండే సమ్మేళనాలు తెల్ల జుట్టును బాగా నల్లగా మారుస్తాయి. అలాగే నిమ్మరసంలో ఉండే పోషకాలు కూడా చుండ్రును తొలగిస్తాయి. జుట్టు కుదుళ్లను కూడా బాగా శుభ్రం చేస్తాయి. ఇక కొబ్బరినూనె కూడా జుట్టుకు పోషణను అందిస్తుంది. దీంతో జుట్టు చాలా ఆరోగ్యంగా ఉంటుంది. దృఢంగా, ఒత్తుగా ఇంకా పొడవుగా పెరుగుతుంది. కాబట్టి వీటి మిశ్రమాన్ని వాడితే అన్ని రకాల జుట్టు సమస్యలకు ఒకేసారి చెక్ పెట్టవచ్చు. ముఖ్యంగా తెల్ల జుట్టు బాగా నల్లగా మారుతుంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి లేకుండా జుట్టును నల్లగా మార్చుకోవచ్చు. కాబట్టి దీన్ని తరచూ ఉపయోగించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: