బలమైన మెరిసే జుట్టు కోసం ఇలా చెయ్యండి!

Purushottham Vinay
కేవలం స్త్రీలు మాత్రమే కాదు పురుషులు కూడా జుట్టు రాలడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు.అసమయమైన ఆహారపుటలవాట్లు ఇంకా అనారోగ్యకరమైన జీవనశైలి, జుట్టు సంరక్షణ లేకపోవడం ఇంకా కాలుష్యం వంటివి ఈ సమస్యకు కారణం కావచ్చు. జుట్టును నేచురల్ గా మెయింటెయిన్ చేయడమే ఈ సమస్యలకు అసలైన పరిష్కారం.ఇక మీరు ఇంట్లో ఏదైనా ప్రయత్నించాలనుకుంటే, పండ్లతో చేసిన హెయిర్ మాస్క్‌లను ఖచ్చితంగా ఉపయోగించండి.అలాగే పుష్కలంగా నీరు త్రాగడంతోపాటు, సహజంగా బలమైన ఇంకా అలాగే మెరిసే జుట్టును పొందడానికి ఈ ఫ్రూట్ హెయిర్ మాస్క్‌లను ప్రయత్నించండి.


డ్యామేజ్ అయిన ఇంకా డల్ హెయిర్‌కి నేచురల్‌గా చికిత్స చేయడంలో అరటిపండు అనేది అత్యంత ప్రభావవంతమైన పండ్లలో ఒకటి. ఈ పండ్లు చాలా తక్కువ ధరకే లభిస్తున్నాయి. అందువల్ల, దీన్ని వారానికి ఒకసారి ఇంట్లో తయారుచేసిన హెయిర్ మాస్క్‌గా కూడా ఉపయోగించవచ్చు. తలపై చుండ్రు లేదా దురద ఉంటే కొద్దిగా పెరుగు ఇంకా నిమ్మరసం కలపండి. ఇక దీన్ని పేస్ట్ చేసి మీ జుట్టుకు అప్లై చేయండి. ఒక 20-30 నిమిషాలు అలాగే ఉంచండి. మెరిసే ఇంకా మృదువైన జుట్టు పొందడానికి మీ జుట్టును చల్లని నీటిలో తేలికపాటి షాంపూతో కడగాలి.అలాగే జామపండులో కూడా విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది కొత్త జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఇంకా అలాగే శ్లేష్మ పొరల పనితీరును పెంచుతుంది.


పండిన జామకాయను తీసుకుని బాగా మెత్తగా చేయాలి. చుండ్రు ఉంటే కొన్ని చుక్కల తేనె ఇంకా నిమ్మరసం కలపండి. వీటిని మిక్స్ చేసి మీ జుట్టుకు బాగా అప్లై చేయండి. ఒక 15 నిమిషాలు అలాగే ఉంచండి.ఆ తర్వాత షాంపూ చేసి బాగా శుభ్రం చేసుకోవాలి.


అలాగే జ్యుసి బొప్పాయి చర్మం ఇంకా జుట్టు రెండింటికీ సహజమైన ఎక్స్‌ఫోలియేటర్. బొప్పాయి, పాలు, పెరుగు ఇంకా తేనెను ఉపయోగించి ఇంట్లోనే ఫ్రూట్ మాస్క్ తయారు చేసుకోవచ్చు. ఇక వీటి అన్నింటినీ మిక్స్ చేసి, ఈ హెయిర్ మాస్క్‌ని మీ జుట్టుకు అప్లై చేయండి. ఒక 25-30 నిమిషాల పాటు అలాగే ఉంచి తేలికపాటి షాంపూతో బాగా కడిగేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: