తెల్ల జుట్టు సమస్య తగ్గాలంటే ఈ ఆయిల్ వాడాల్సిందే!

Purushottham Vinay
చాలా మంది కూడా తెల్ల జుట్టు సమస్యతో చాలా ఎక్కువగా బాధ పడుతూ వుంటారు. అలా తెల్ల జుట్టు సమస్యతో బాధ పడే వారికి భింగ్రాజ్ లేదా గుంట గలగలగరాకు చాలా మేలుని చేస్తుంది. ఇక ఈ ఆయిల్ జుట్టు సమస్యలు వంటి వాటిని తొలగించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ప్రతీ ఒక్క నూనె తయారీలో ముఖ్యంగా ఆయుర్వేద నూనెల తయారీల్లోనూ ఈ భింగ్రాజ్ మూలికలను చాలా ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.అయితే ఈ హెర్బ్ ను అందరూ ఫాల్స్ డైసీ అని కూడా అంటారు. ఈ ఔషధ మూలిక పొద్దు తిరుగుడు కుటుంబానికి చెందిన మొక్క ఇంకా అలాగే భారత దేశం, థాయిలాండ్ ఇంకా బ్రెజిల్ వంటి తేమ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పెరుగుతుంది.ఇక ఈ భింగ్రాజ్ హెర్బ్ ఆకులను రెండు మూడు రోజులు ఎండ బెట్టి.. ఆపై కొబ్బరి లేదా నువ్వుల నూనెలో బాగా కలుపుతారు. ఇక ఈ నూనెను దాని రంగు ఆకుపచ్చగా మారే దాకా మరో రెండు మూడు రోజులు ఎండలో ఉంచుతారు.


అలాగే గంటగులగరాకులో ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, విటామిన్ డి ఇంకా విటామిన్ ఇ వంటి పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ సూపర్ ఎఫెక్టివ్ హెర్బ్ ని ఎక్కువగా జుట్టు సమస్యలకు ఎక్కువగా ఉపయోగిస్తారు.భింగ్రాజ్ నూనె నెత్తి మీద ఇంకా అలాగే మూలాలకు రక్త ప్రసరణను పెంచుతుంది. ఇది జుట్టు పెరుగుదలను కూడా ప్రోత్సహిస్తుంది. అలాగే ఒత్తిడి కారణంగా ఊడిపోయే జుట్టును కూడా ఊడకుండా చేస్తుంది. భింగ్రాజ్ ఆయిల్ మీ తలను బాగా చల్లబరుస్తుంది. అలాగే ఒత్తిడి ఇంకా అలాగే భయాలను తొలగిస్తుంది. ఈ హెర్బ్ లో ఉండే ఖనిజాలు ఇంకా విటమిన్ల వల్ల జుట్టు రాలడాన్ని కూడా నివారిస్తుంది. అంతే కాకుండా ఇందులో ఉండే యాంటీ ఇన్ ఫ్లమేటరీ ఇంకా యాంటీ ఫంగల్ చుండ్రుని కూడా తగ్గించడానికి ఎంతగానో ఉపయోగపడతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: