పెళ్లిలో సహజంగా.. అందంగా మెరవాలి అంటే..?

Divya
పెళ్లి అనగానే అమ్మాయిలు పెళ్లి ముహూర్తం కంటే రెండు వారాల ముందు నుంచి ముస్తాబు అవుతూ ఉంటారు. అంతే కాదు తమ ముఖమును పెళ్లి రోజుకి మరింత గ్లో కనిపించాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ పార్లర్ల చుట్టూ తిరుగుతూ చర్మ సంరక్షణ కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా ముఖానికి చేసే రెగ్యులర్ మసాజ్ వల్ల రోగనిరోధక శక్తిని మెరుగుపరిచి.. ముఖం మీద ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా చేస్తుంది. పెళ్లికి అందంగా మెరవాలి అంటే.. మేకప్ వేసుకుంటే అందంగా కనిపిస్తారు అని అందరూ అనుకుంటూ ఉంటారు. అయితే మేకప్ వేసుకోకుండా సహజంగా , అందంగా కనిపించాలంటే కొన్ని రకాల టిప్స్ ఫాలో అవ్వాలని సౌందర్య నిపుణులు తెలియజేస్తున్నారు.
అవి ఏమిటంటే.. బాడీ మసాజ్.. ముందు మనం అందంగా మెరవాలి అంటే మనల్ని మనం ప్రేమించుకోవాలి.. మన చర్మ సంరక్షణ ఎంతగా పాటిస్తామో అప్పుడు శరీరంలో రక్త ప్రసరణ బాగా జరిగి ప్రకాశవంతంగా మెరవడానికి ఈ బాడీ మసాజ్ అనేవి చాలా సహాయపడతాయి.

ఆరోగ్యకరమైన ఆహారం:
అందంగా మెరవాలి అంటే పెళ్లికి రెండు నెలల ముందు నుంచి మంచి ప్రోటీన్ కలిగిన ఆహారం తీసుకోవడం చాలా అవసరం. ఆరోగ్యకరమైన ఆహారం తో పాటు ప్రోటీన్లు,  ఫైబర్ కూడా తీసుకున్నప్పుడు ఖచ్చితంగా చర్మంలో  గ్లో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

చర్మానికి ఫేషియల్స్:
పెళ్లికి నెల ముందు నుంచే ఫేషియల్ చేసుకోవడం చాలా అవసరం. ముఖానికి ఎలాంటి ఫేషియల్ సరిపడుతుందో ఒకసారి వైద్యుడిని సంప్రదించి రెగ్యులర్ ఫేషియల్ చేయించుకోవచ్చు.
కంటినిండా సరిపడా నిద్ర:
అందంగా మెరవాలి అంటే కచ్చితంగా సరైన నిద్ర అవసరమని నిపుణులు చెబుతున్నారు. సరైన నిద్ర ఉండడం వల్ల ముఖంపై గ్లో కూడా కనిపిస్తుందట. ఇక అంతే కాదు రోజువారీగా డబుల్ క్లెన్సింగ్ చేసుకోవడం చాలా అవసరం. ఇలా చేయడం వల్ల ముఖం మీద ఏర్పడే టాక్సిన్ లు త్వరగా తొలగిపోతాయి. అంతే కాదు చర్మ కణాలు పునరుజ్జీవింపచేసి.. చర్మం ప్రకాశవంతంగా తయారవుతుంది. సరిపడా నీళ్లు తాగడం.. యోగా చేయడం లాంటివి చేయాలి.
మీరు గనక పెళ్లికి ముందు రోజు నుంచి ఇలాంటి చిట్కాలు పాటిస్తే తప్పకుండా చర్మం ఆరోగ్యంగా అందంగా మెరుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: