జుట్టు దృఢంగా అవ్వటానికి కావాల్సిన పోషకాలు..

Purushottham Vinay
జుట్టు అనేది ప్రోటీన్‌తో తయారు చేయబడింది. పొడి, పెళుసుగా ఇంకా బలహీనమైన జుట్టుకి ప్రధాన కారణం శరీరంలో ప్రోటీన్ లేకపోవటం.కాబట్టి ఆరోగ్యకరమైన ఇంకా దృఢమైన జుట్టు పెరుగుదల కోసం మీ ఆహారంలో ప్రోటీన్ చేర్చడం అనేది చాలా అవసరం. అలాగే నాన్ వెజ్ ఫుడ్స్ కూడా ప్రోటీన్ కు గొప్ప మూలం.ఇక శాకాహారులు తమ ఆహారంలో భాగంగా చిక్కుళ్ళు, టోఫు, జున్ను ఇంకా గింజలను తినవచ్చు.దీనికి గుడ్లు కూడా చాలా మంచి ఆహారం.ఇవి కేవలం ప్రోటీన్ కు మాత్రమే కాకుండా బయోటిన్ కి కూడా మంచి మూలం అని చెప్పాలి.

ఇక జుట్టుకు ఐరన్ కూడా చాలా ముఖ్యమైన పోషకం అని చెప్పాలి. పోషకాలు ఎక్కువగా ఉండే రక్త ప్రవాహం ద్వారా జుట్టు మూలాలు బాగా బలపడతాయి. అందువల్ల, ఐరన్ తగ్గడంతో జుట్టు ఊడిపోవడం అనేది పెరుగుతుంది. ఐరన్ లోపం వల్ల జుట్టుకు పోషకాల సరఫరాలో ఆటంకం కలుగుతుంది.ఇది జుట్టు పెరుగుదలను కూడా బాగా నిరోధిస్తుంది. మాంసాహారులు ఐరన్ స్థాయిలను పెంచుకోవడానికి ఎర్ర మాంసం లేదా చికెన్ వంటి పదార్ధాలను తినవచ్చు. శాఖాహారులు తమ ఆహారంలో భాగంగా పాలకూర, ఆకు కూరలు, బ్రోకలీ, బఠానీలు, పాలకూర ఇంకా జొన్నలను తినవచ్చు.

ఇక జింక్ అనేది కూడా మీ తలను కాపాడడంలో ఎంతగానో సహాయపడుతుంది. ఇందువల్ల చాలా తరచుగా పొడి జుట్టు వల్ల జుట్టు ఎక్కువగా రాలడం జరుగుతుంది. అలాగే జింక్ లోపం వల్ల జుట్టు ప్రోటీన్ నిర్మాణంలో మార్పు కూడా వస్తుంది.ఇది జుట్టు నిర్మాణాన్ని కూడా బాగా బలహీనపరుస్తుంది. మీ జుట్టును ఆరోగ్యంగా ఇంకా దృఢంగా ఉంచడానికి మీరు మీ ఆహారంలో చేర్చాల్సిన ముఖ్యమైన పోషకాలలో జింక్ అనేది కూడా ఒకటి. ఇది జుట్టు కణాల పెరుగుదలలో ముఖ్యం పాత్రని పోషిస్తుంది.ఇక తృణధాన్యాలు,గుల్లలు, గోధుమ ఇంకా గుమ్మడికాయ గింజలు జింక్ కలిగి ఉన్న కొన్ని ఆహారాలు తినడం వల్ల జింక్ జుట్టుకి బాగా అందుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: