మీ జుట్టును ఇంట్లోనే స్ట్రెయిట్ చేసుకోండిలా..?

Divya
అందం మగువల సొంతం.. ఇకపోతే కురులు.. కురులే కావంటారు మరి కొంతమంది మగువలు.. ఇకపోతే ఈ జుట్టుని చాలామంది ఎంతో ప్రేమగా ఆప్యాయంగా చూసుకుంటూ ఉంటారు అనడం లో ఎలాంటి సందేహం లేదు. ఈ అందమైన జుట్టు కోసం ఎన్నో ప్రయత్నాలు చేసి ,ఎంతో అందంగా తీర్చిదిద్దుకునేందుకు మరీ కొంత మంది ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొంతమంది తమ జుట్టు గడ్డిలా గా ఉంది అని అభిప్రాయపడుతుంటే, మరికొంతమంది రింగులు రింగులు ఉంది అంటూ మరికొంత మంది చెబుతుంటారు. ఎవరైతే తమ జుట్టు స్ట్రెయిట్ కావాలని కోరుకుంటారో అలాంటి వారు ఇప్పుడు చెప్పబోయే కొన్ని చిట్కాలు పాటించి చూడండి. పార్లర్ కు వెళ్లకుండానే ఇంట్లో ఉంటూనే జుట్టును చాలా చక్కగా, అందంగా, స్ట్రెయిట్ గా చేసుకోవచ్చు.
ఇటీవల కాలంలో చాలా మంది జుట్టును స్ట్రెయిట్  చేసుకోడానికి మార్కెట్లో దొరికే ఎలక్ట్రిక్ హెయిర్ డ్రయర్ ను ఉపయోగిస్తున్నారు. ఈ విధానం చాలా సులభంగా ఉంటుంది.. పైగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. కాబట్టి ఎక్కువ మంది ఈ ప్రక్రియ పై మొగ్గు చూపడం గమనార్హం. ఇలాంటి వాటికి బదులు ఇంట్లోనే సహజసిద్ధంగా స్ట్రెయిట్ హెయిర్ పొందాలి అనుకుంటే.. నిమ్మకాయ రసం కోకోనట్ పాలను కలిపి జుట్టుకు ఉపయోగించడం వల్ల జుట్టు స్ట్రెయిట్ గా మారుతుంది.
కోడిగుడ్లు అలాగే ఆలివ్ ఆయిల్ ను ఉపయోగించి జుట్టును స్ట్రెయిట్ చేసుకోవచ్చు.
పాలు , తేనె ను కూడా ఉపయోగించవచ్చు.
బియ్యం పిండి, ఎగ్ మాస్క్ లను ఉపయోగించి జుట్టును స్ట్రెయిట్ చేసుకోవచ్చు.
అలోవెరాను ఉపయోగించవడం వల్ల కూడా జుట్టు స్ట్రెయిట్ గా అవుతుందని అంటారు నిపుణులు.
అరటిపండు, ఆలివ్ ఆయిల్, పెరుగు మూడింటినీ కలిపి చక్కగా జుట్టు కుదుళ్ల నుంచి మొనల వరకు పట్టించడం వల్ల కూడా అతి తక్కువ సమయంలోనే  స్ట్రెయిట్ గా తయారవుతుంది.
ఆపిల్ సైడర్ వెనిగర్ ను కూడా జుట్టుకు పట్టించడం వల్ల జుట్టు స్ట్రెయిట్ గా మారుతుంది.
ఇక వీటితో పాటు అరటి పండు అలాగే బొప్పాయి గుజ్జును  కలిపి జుట్టుకు పట్టించినా కూడా జుట్టు స్ట్రెయిట్ గా మారుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: