జీడిపప్పుతో ఇలా చేస్తే అందమే అందం..

Purushottham Vinay
వానా కాలంలో చర్మ సమస్యలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక వీటిని మనం నయం చేయడానికి దాదాపుగా మార్కెట్లో దొరికే అన్ని బ్యూటీ ప్రొడక్ట్స్‌ని కూడా వాడుతాము. అయితే మన ఇంట్లో దొరికే తినే పదార్ధాలతో మంచి అందాన్ని సంపాదించుకోవచ్చు.ఇక జీడిపప్పు చర్మం రంగును పెంచడానికి ఉపయోగపడుతుందట.జీడిపప్పు అనేది ఆరోగ్యాన్ని పెంచడమే కాకుండా చర్మానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.ఇక ఇందులో ఉండే పోషకాలు చర్మాన్ని బాగా కాంతివంతం చేస్తాయి. జీడిపప్పులో  ప్రోటీన్, విటమిన్ ఈ చాలా పుష్కలంగా ఉంటాయి.ఇక ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ సూర్యుని హానికరమైన కిరణాల నుంచి ముఖాన్ని కాపాడుతుంది.అంతే కాకుండా జీడిపప్పు జుట్టుకు కూడా చాలా మేలును చేస్తుంది. మీరు జీడిపప్పుతో ఫేస్ ప్యాక్ ని తయారు చేసుకుంటే చాలా మంచిది.

ఇక జీడిపప్పు ఫేస్ ప్యాక్ తయారు చేయడానికి 8 నుంచి10 జీడిపప్పులను పాలలో బాగా నానబెట్టి వాటిని ఒక అరగంట పాటు ఉంచాలి. ఆ తరువాత జీడిపప్పుని బాగా మెత్తగా రుబ్బి పేస్ట్‌లాగా చేయాలి. ఇక ఆ పేస్ట్‌కి రెండు చెంచాల గ్రామ్ పిండిని బాగా కలపాలి.ఇక మొదటగా ఆ పాలలో కాటన్ ముంచి ముఖం ఇంకా మెడను బాగా శుభ్రం చేయాలి. ఆ తర్వాత జీడిపప్పు పేస్ట్‌ని ముఖానికి బాగా అప్లై చేయాలి. ఈ పేస్ట్‌ని ఒక 20 నిమిషాల పాటు అలాగే ముఖానికి ఉంచి ఆ తర్వాత నీటితో ముఖాన్ని బాగా శుభ్రం చేసుకోవాలి. ఇక ఈ ఫేస్ ప్యాక్‌ను వారానికి ఒకసారి ముఖానికి అప్లై చేయాలి. జిడ్డు, పొడి చర్మానికి ఈ ఫేస్ ప్యాక్ అప్లై చెయ్యడం అనేది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.జీడిపప్పు ఫేస్ ప్యాక్ ని ముఖానికి వేసుకోవడం ద్వారా ముఖం ఎంతో కాంతివంతమవుతుంది. దీనితో పాటు ముఖంపై ఏమైనా గీతలు ఉంటే ఆ గీతలను తొలగించడంలో కూడా ఈ ప్యాక్ ఎంతగానో సహాయపడుతుంది. అలాగే వడదెబ్బ ఇంకా చర్మశుద్ధి సమస్యను వదిలించుకోవడానికి కూడా ఈ ఫేస్ ప్యాక్‌ని మనం ఉపయోగించవచ్చు. ఇక ఇది కాకుండా చర్మం పొడిబారడాన్ని కూడా తగ్గించడంలో ఈ ప్యాక్ అనేది సహాయపడుతుంది.అలాగే జీడిపప్పు చర్మాన్ని పోషించడానికి ఇంకా బిగించడానికి ఎంతో చక్కగా పనిచేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: