జుట్టు ఊడిపోకుండా పెరగడానికి ఇలా చెయ్యండి..

Purushottham Vinay
ఈ వానా కాలంలో ప్రతి రోజూ కూడా తలంటు స్నానం చేయాలి. లేదంటే తేమ వల్ల మీ జుట్టు అనేది బాగా జిడ్డుబారిపోతుంది. దీని వల్ల కుదుళ్లు బలహీనంగా అవుతాయి.ఇక తలస్నానం చేసేటప్పుడు యాంటీ-బాక్టీరియల్ షాంపూలు ఇంకా క్లీనర్లు వాడాలి. ఫంగల్ అలాగే బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లను అరికట్టడానికి ఇవి ఎంతగానో ఉపకరిస్తాయి.ఇక వాన నీటిలో దుమ్ము చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఆమ్లసహితం కూడా ఎక్కువగా ఉంటుంది.ఇక దీని నుంచి రక్షణ పొందాలంటే లీవ్ ప్రొడక్ట్స్ అనేవి వాడాలి. ఇవి మన జుట్టుపై రక్షణాత్మకమైన పొరను ఏర్పరుస్తాయి. అలాగే వర్షపు నీటి వల్ల జుట్టును  రాలిపోకుండా కూడా కాపాడతాయి.అలాగే జుట్టు తడిగా ఉన్నప్పుడు జడ లేదా ముడి అస్సలు వేసుకోకండి. ఎందుకంటే దీని వల్ల జుట్టు పాడవడమే కాకుండా దుర్వాసన కూడా బాగా వస్తుంది.ఇక ఒకవేళ మీ జట్టు తడిస్తే, టవల్‌తో రుద్ది రుద్ది అస్సలు తుడవకండి. ఇలా చేయడం వల్ల జుట్టు బాగా రాలిపోతుంది.

ఇక దీనికి బదులుగా టవల్‌ను మీ జుట్టకు చక్కగా చుట్టిపెట్టండి. నీరు మొత్తం పోయే వరకూ టవల్‌తో బాగా పిండండి.ఇక జుట్టు రాలిపోవడానికి తడి జుట్టు కూడా ఒక కారణం కావచ్చు. అందుకే అసలు జుట్టు పూర్తిగా ఆరిపోయేవరకు దువ్వెన అసలు వాడకండి.ఇక జుట్టును ఆరోగ్యంగా ఇంకా బలంగా ఉంచేవి ప్రోటీన్లు. మనకు ప్రోటీన్లు తగ్గిన కొద్దీ జుట్టు అనేది బాగా పలచబడిపోతుంది.ఇక అందుకు ప్రోటీన్లు సమృద్దిగా ఉండే పాలకూర, క్యాలీఫ్లవర్,కీరా, క్యాప్సికం ఇంకా టమాటా వంటి కూరగాయలని రోజు ఖచ్చితంగా తీసుకునే ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.ఇక అలాగే సల్ఫర్ అమినో యాసిడ్స్ కూడా జుట్టు ఒత్తుగా ఉండేందుకు ఎంతగానో దోహదం చేస్తాయి. అలాగే సోయాబీన్స్ , రాగి, బీట్రూట్, నువ్వులు, అరటి, ఖర్జూరం, ద్రాక్షా ఇంకా కోడిగుడ్డుల నుంచి ఈ సల్ఫర్ అమినో ఆమ్లాలు అనేవి పుష్కలంగా దొరుకుతాయి.కాబట్టి ఈ పద్ధతులు పాటించండి.జుట్టుని ఆరోగ్యంగా దృఢంగా ఉంచుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: