బాదం తినడం వల్ల ముఖం పైన మచ్చలు, మడతలను తొలగించవచ్చా..?

Divya

మహిళలకు ముఖ సౌందర్యాన్ని తగ్గించే సమస్యలలో ముడతలు, ముఖం పైన మచ్చలు మొదటి  కారణం. వీటి వల్ల ముఖం అందవిహీనంగా మారుతుంది. ఈ సమస్యల నుంచి బయటపడటానికి కొన్ని సౌందర్య సాధనాలు ఉన్నా సత్ఫలితాలు ఇస్తున్నాయన్న గ్యారెంటీ లేదు. పైగా ఒకసారి దుష్ప్రభావాలు కూడా ఎదురు కావచ్చు. ఇలాంటి పరిస్థితిలో బాదంపప్పును ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల మహిళలలో వచ్చే ఈ సమస్యలను అధిగమించవచ్చని తాజా అధ్యయనంలో తేలింది.

చర్మ సమస్యలు:
క్యాలరీలు తక్కువగా ఉండే బాదంపప్పును చాలా మంది బరువు తగ్గించుకోవడానికి స్నాక్స్ రూపంలో వినియోగిస్తారు. ఇందులో విటమిన్ ఈ తో పాటు మోనో అన్ సాచ్యురేటెడ్ కొవ్వుల కారణంగా మహిళలలో గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం తక్కువని కూడా అధ్యయనాల్లో తేలింది.అంతేకాకుండా బాదంపప్పులు మహిళల్లో ముఖం పైన ముడతలు, పిగ్మెంటేషన్, మచ్చలను కూడా మాయం చేస్తాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాస్త్రవేత్తలు ఒక అధ్యయనం నిర్వహించారు.

పరిశోధనలో భాగంగా ఎండ పడ్డప్పుడు చర్మం మండే, ముడుతలు పడే,రంగు మారిపోయే ప్రభావం కలిగిన మహిళలు రెండు బృందాలుగా విభజించారు. వీళ్లంతా మోనోపాజ్ దశలో ఉన్న ఆరోగ్యవంతులైన మహిళలే కావడం గమనార్హం.  అందుకే  వీరిలో ఒక బృందానికి  బాదం పప్పులను స్నాక్స్ కింద సుమారు 60 గ్రాముల బాదం పప్పును తీసుకోవాలని చెప్పారు. ప్రతిరోజు వారు తీసుకునే మొత్తం క్యాలరీల దీని వాటా 20 శాతం గా ఉండేలా చూశారు. ఇక రెండవ బృందానికి ఇతర ఆహార పదార్థాలను అల్పాహారంగా ఇచ్చారు.

 ఇక ఆ తర్వాత  స్కిన్ హైడ్రేషన్, చర్మం నుంచి ఆవిరయ్యే నీరు, చర్మం నుంచి వచ్చే జిడ్డు ను ను ఆధారంగా తీసుకొని ఈ అధ్యయనం సాగింది.ఇందులో భాగంగా మొదటి 16 వారాల్లో బాదంపప్పు ఆహారంగా తీసుకున్న మహిళల ముఖాలపై మడతలు తీవ్రత 15 శాతం మేర తగ్గిందని, అదే విధంగా 24 వారాల తరువాత 16 శాతం మేర తగ్గిందని శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు. అదేవిధంగా పిగ్మెంటేషన్ సమస్య తీవ్రత 24 వ వారం నాటికి 20 శాతం మేర తగ్గింది అని పరిశోధకులు స్పష్టం చేశారు.

బాదం పప్పు తీసుకున్న యెడల 24 వారాల్లో మహిళల్లో ఎలాంటి బరువు మార్పు కనిపించలేదు అని ఈ అధ్యయనం స్పష్టం చేసింది.ఈ సందర్భంగా బాదంపప్పులో అధికంగా ఉండే అల్ఫా టోకోఫెరాల్ కారణంగానే మహిళలలో ముడతలు, పిగ్మెంటేషన్ సమస్యలు తీవ్రంగా తగ్గుతున్నట్టు ఈ పరిశోధనలో తెలిసింది అని ఈ అధ్యయనం స్పష్టం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: