వంటిల్లే మీ సౌందర్య గని

Durga
వంటింట్లో లభించే దినుసులతోనే సౌందర్యానికి చికిత్సలెన్నో చేసుకోవచ్చని మనకు తెలుసు కదూ అలాంటివే ఇవి కూడా! కేరెట్ ను తురిమి కొద్దిగా పచ్చిపాలు కలిపి మెత్తగా రుబ్బి ఈ ముద్దని మెడ, చేతులకి నాలుగైదుసార్లు చొప్పున రాయాలి. కొద్దిసేపటి తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి. దీని ద్వారా చర్మానికి సమృద్దిగా విటమిన్లు చేకూరుతాయి. కొద్దినీటిలో క్యాబేజీని ఉడకబెట్టి ఈ నీరు చల్లారిన తరువాత ఆ నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే ముఖంపై మచ్చలు, నల్లబడటం పోయి చర్మం నునుపుగా వుంటుంది. ఆలుగడ్డల్ని ఉడికించి అనంతరం రెండు స్పూనుల పాలు కలిపి మిక్సీలో వేసి మెత్తగా చేయాలి. ఈ ముద్దని గోరువెచ్చగా వుండగానే ముఖానికి పట్టించాలి. పావుగంట తర్వాత గోరువెచ్చని నీటితో కడిగి అనంతరం పాల మీగడ రాసి పది నిమిషాల తర్వాత కడిగేయాలి. ముఖం ఎంత కాంతివంతంగా ఉంటుందో మీరే గమనిస్తారు. బంగాళాదుంపల్ని సన్నని చెక్కులుగా తరిగి రసం తీసి రాసుకున్నా చర్మం మృదుత్వాన్ని సంతరించుకుంటుంది. ఉడకబెట్టిన బంగాళాదుంప గుజ్జును ముఖానికి రాసుకుంటే తెగిన, కాలిన గాయాలు మానుతాయి. మొటిమలు తగ్గి, ముఖం కాంతివంతంగా తయారవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: