డబుల్ చిన్ తో బాధపడుతున్నారా..? అయితే ఇలా చేయండి..!
మనలో చాలా మంది అందంగా ఉండడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ముఖంలో మెరుపులు తీసుకురావడానికి వాళ్ళు చేసే ప్రయత్నాలు అంతా ఇంతా కాదు.. అయితే ముఖం అందంగా ఉండాలి అంటే కేవలం చర్మం పైన ముడతలు, మచ్చలు లేకుండా ఉంటేనే అందంగా కనిపిస్తారు అనేది భ్రమ. ముఖం కూడా సన్నగా, నాజూగ్గా ఉన్నప్పుడే అందంగా కనిపిస్తారు అనే విషయం చాలా మందికి తెలియదు. అందులో భాగంగానే ప్రస్తుత కాలంలో చాలా మంది డబుల్ చిన్ తో బాధపడుతున్నారు. అయితే కొన్ని ముఖ వ్యాయామాలు చేయడం ద్వారా డబుల్ చిన్, ఫేస్ ప్యాట్ ను తగ్గించుకోవచ్చు అంటున్నారు నిపుణులు. అయితే ఆ చిట్కాలేంటో, వ్యయమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం...
ముఖ వ్యాయామం చేయడం :
ముఖ వ్యాయామం చేయడం అనేది చాలా మంచి పద్ధతి. ఇలా చేయడం వల్ల ముఖ కండరాలకు బలం చేకూరుతుంది. అయితే ఈ పద్ధతి ఎలా పాటించాలి అంటే మీ నాలుకను బయటకు తీసి పది సెకండ్ల పాటు బయటనే ఉంచండి. మీ గడ్డం, మెడ వద్ద కండరాలపై ఒత్తిడి పడే వరకు అలాగే ఉంచండి. ఈ వ్యాయామం డబుల్ చిన్ తో పాటు కొవ్వును కూడా కరిగించి ముఖానికి మంచి రూపాన్ని అందిస్తుంది..
అందులో భాగంగానే కింది దవడ ను పైకి, కిందకు తక్కువలో తక్కువ పది సార్లు అయినా అనాలి. ఇలా చేయడం వల్ల క్రింది దవడ కింద పేరుకున్న కొవ్వు కరిగి డబుల్ చిన్ తగ్గిపోతుంది. ఫలితంగా అందమైన ముఖ రూపాన్ని పొందవచ్చు.
అలాగే మద్యపానానికి దూరంగా ఉండాలి. మద్యపానం అతిగా తాగినా ముఖం వద్ద కొవ్వు పేరుకుపోతుంది. మద్యం తాగాలి అని అనిపించినప్పుడు అల్లా నీళ్లు తాగడానికి ప్రయత్నించండి. ఫలితంగా అధిక కొవ్వు కరిగే అవకాశం కూడా వుంది. సోడియం తక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవడం మంచిది. ప్రస్తుత కాలంలో దాదాపు అన్ని రకాల ప్రాసెస్డ్ ఫుడ్స్ లో ఉప్పు కలిసి ఉంటుంది. ఈ ఉప్పు శరీరంలో ఫేస్ ఫ్యాట్ ను పెంచడానికి దోహదపడుతుంది.