చక్కనైన కురులకు చిక్కటి ఆముదం..?

Divya

సాధారణంగా మనలో చాలామంది జుట్టు సంరక్షణ కోసం ఎన్నో రకాల నూనెలను ఉపయోగిస్తూ ఉంటారు. వాటివల్ల కొంతవరకు ఉపశమనం కలుగుతుంది. అయితే అందులో చాలామంది చమురును  ఉపయోగించడానికి  ఇష్టపడరు. ఇందుకు కారణం చమురును జుట్టుకు అప్లై చేసిన తర్వాత అది జిగటగా,ఆయిలీగా అనిపిస్తుంది కాబట్టి. కానీ నిజానికి చమురును జుట్టుకు అప్లై చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు అని వైద్యులు సూచిస్తారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
జుట్టు రాలడాన్ని నివారించే లక్షణం ఆముదానికి చక్కగా ఉంది. అయితే ఇందుకోసం మీ జుట్టు పొడవును బట్టి, ఒత్తును బట్టి ఆముదం తీసుకొని, అందులో రెండు నుండి మూడు చెంచాల అల్లం రసం కలిపి, వెంట్రుకలకు,కుదుళ్లకు పట్టించాలి. 20 నిమిషాలు ఆరిన తర్వాత చల్లటి నీటితో తలస్నానం చేయాలి. ఇలా వారానికి మూడుసార్లు చేస్తే జుట్టు రాలే సమస్య నుండి బయటపడవచ్చు.
చుండ్రు ను తగ్గించే శక్తి ఆముదానికి పుష్కలంగా ఉంది. ఇందుకోసం జుట్టుకు సరిపడా ఆముదం తీసుకొని,అందులో రెండు టేబుల్ స్పూన్ల కలబంద గుజ్జు, మూడు చుక్కల టీ ట్రీ ఆయిల్ ను కలపాలి. ఆముదం లో కలబంద గుజ్జు కలిపి, చివరగా టీ ట్రీ ఆయిల్ వేసి అన్నీ కలిసేలా గిలక్కొట్టాలి. ఈ మిశ్రమాన్ని కుదుళ్ళకు పట్టించి, 30 నిమిషాలు ఆరనిచ్చి, తలస్నానం చేయాలి. ఇక ఈ పద్ధతిని నెలకు నాలుగుసార్లు పాటించడం వల్ల చుండ్రును సులభంగా తగ్గించుకోవచ్చు.
కురులు ఒత్తుగా పెరగాలంటే ఆముదం నూనె ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆముదం నూనెను, ఆలివ్ ఆయిల్ ను సమపాళ్ళలో తీసుకొని కలపాలి. అయితే ఈ నూనె ను డబుల్ బాయిలింగ్ పద్ధతిలో వేడిచేసి, అందులో మూడు చుక్కల రోజ్మెరీ ఆయిల్ కలిపి, జుట్టు కుదుళ్లకు పట్టించాలి. తరువాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు పెరగడాన్ని గమనించవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: