గోవాలో కొత్తరకం ట్రెండ్ ఫాలో అవుతున్న పర్యాటకులు..!

kalpana
మన దేశంలో పర్యాటక ప్రాంతాలలో అత్యంత పేరు గాంచిన ప్రదేశాలలో గోవా ఒకటని చెప్పవచ్చు. ఇది వరకు గోవా పర్యటనకు వెళ్లిన పర్యాటకులు గోవా అందాలను తిలకిస్తూ అక్కడ ఉన్నటువంటి రిసార్ట్ లలో, హోటళ్లలో సేదతీరే వారు. అయితే ప్రస్తుతం గోవా పర్యాటకుల ఆలోచనా విధానంలో మార్పులు చోటుచేసుకున్నాయి. ఎక్కువగా గోవాకి వెళ్లే పర్యాటకులు ఈ మధ్యకాలంలో అక్కడ ఉన్నటువంటి రిసార్ట్ లలో, హోటళ్లలో  సేదతీరడం కన్నా పక్కన ఉన్నటువంటి గ్రామాలలో ఇళ్లను అద్దెకు తీసుకొని సేదతీరుతూ గోవా అందాలను తిలకించడానికి ఇష్టపడుతున్నారు.                                       
గోవాలోని ముఖ్యంగా బీచ్ వద్ద ఉండే గ్రామీణ ప్రాంతాలలో ఉండే అద్దె ఇళ్లకు బాగా గిరాకీ పెరిగిందని ఇంటిలో ఉంటూ గోవా బీచ్ అందాలను చూస్తూ ఆనంద పడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ట్రెండ్ ఉత్తర గోవాలోని అరంబోల్ ప్రాంతంలో ఎక్కువగా నడుస్తోంది. అద్దెకు ఉండడం కోసం ఆ ప్రాంతానికి సంబంధించిన ఇళ్లను ఫేస్ బుక్ ఖాతా వంటి సామాజిక మాధ్యమాలలో బాగా సెర్చ్ చేసి, ఎంక్వయిరీ చేసుకొని అద్దెకు తీసుకోవడం విశేషం.
ఈ మధ్యకాలంలో గోవా వెళ్లడానికి నిశ్చయించుకున్న బడా బాబులు వారితో పాటు వారి ఇంటిలో పని చేసేటటువంటి పనివాళ్లను,వంట వాళ్లను కూడా తీసుకెళ్లడంతో ఏదైనా హోటల్లో ఉండడం కంటే, ఈ విధంగా ఇంటిని అద్దెకు తీసుకొని ఉండడం ఉత్తమమని భావిస్తున్నారు. ఈ విధంగా గోవా వచ్చే పర్యాటకులు ఏదైనా ఇంటిని అద్దెకు తీసుకుని ఉండటానికి ఇష్టపడటం వల్ల గోవాలో పలు హోటళ్లకు గిరాకీ కూడా తగ్గిందని ఫస్ట్ క్లాస్ హాలీడేస్ సంస్థ డైరెక్టర్ ఆతిష్ ఫెర్నాండెజ్ తెలిపారు. ప్రస్తుతం గోవా వచ్చే పర్యాటకులు అందరూ ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నట్లు ఆతీష్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: