మొటిమలు తగ్గి ముఖం అందంగా ఉండాలంటే ఈ పద్ధతులు పాటించండి....

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...యుక్త వయసు లోకి వచ్చాక చాలా మందికి మొటిమలు మొదలవుతాయి.అవి తగ్గక అనేక విధాలుగా సతమతమవుతూ ఉంటారు.ఇవి వారి వారి శరీర తత్వాలను బట్టి కొంతమందికి తగ్గుతాయి. మరికొంత మందికి ఎన్ని రోజులైనా సరే సమస్య తగ్గదు. ఎక్కువ అవుతూనే ఉంటుంది. దీనికి కాలుష్య కారకం, నిద్రలేమి, జీవనశైలి ఇలాంటి అనేక కారణాలు ఉంటాయి. వీటిని తగ్గించుకునేందుకు చాలా మంది బ్యూటీ పార్లర్స్‌కి వెళ్లడం, క్రీమ్స్ వాడడం వంటివి చేస్తుంటారు. కొన్ని ఇంటి చిట్కాలను ఉపయోగించడం వల్ల మొటిమలు త్వరగా తగ్గుతాయి. ఆ టిప్స్ ఏంటో ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి....
ఓ ఆపిల్ స్లైస్‌ని తీసుకుని ముఖంపై రబ్ చేయాలి. ఇలా రెగ్యులర్‌గా చేస్తుండాలి. ఇలా చేయడం వల్ల జిడ్డు తగ్గుతుంది. మొటిమలకి కారణం జిడ్డు.. కాబట్టి ఇలా చేస్తుంటే మొటిమల సమస్య తగ్గుతుంది. దీంతో ముఖం కూడా తాజాగా కూడా మారుతుంది.ఓ బౌల్‌లో టేబుల్ స్పూన్ శనగపిండి తీసుకోవాలి. ఇందులో కాస్తాంత పసుపు, రెండు స్పూన్ల నిమ్మరసం వేసి కలపాలి. అవసరం అనుకుంటే రోజ్‌వాటర్వేసి పేస్ట్‌లా కలపాలి. దీన్ని ముఖంపై ప్యాక్‌లా వేయాలి. 15 నిమిషాలు తర్వాత నీటిని చల్లుతూ దాన్ని స్క్రబ్‌లా రాస్తూ నీటితో కడిగేయాలి.ముఖంపై మొటిమలు ఉన్నప్పుడు ఐస్ వాటిని త్వరగా తగ్గిస్తాయి. దీని కోసం ఓ బౌల్‌లో ఐస్ క్యూబ్స్, ఐస్ వాటర్ వేసి ముఖం అందులో 10 సెకన్ల చొప్పున, రెండు, మూడు సార్లు పెడుతుండాలి. ఇలా చేయడం వల్ల సమస్య చాలా వరకూ తగ్గుతుంది.
లేదా.. ఓ ఐస్ క్యూబ్‌ని తీసుకుని మొటిమలపై పెట్టాలి. మరి ఇబ్బందిగా అనిపిస్తే ఓ క్లాత్‌లో ఐస్ క్యూబ్స్ పెట్టి దానితో మొటిమలపై రుద్దాలి. ఇలా చేయడం వల్ల సమస్య త్వరగా తగ్గుతుంది.మొటిమలు ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో రాత్రి పడుకునే సమయంలో వెల్లుల్లిని చిదిమి రాయాలి. ఇలా చేయడం వల్ల మొటిమల సమస్య తగ్గుతుంది.ఇక ఇలాంటి మరెన్నో సౌందర్య చిట్కాల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: