అందంతోపాటు సందర్భానికి తగ్గ సరిజోళ్ళు..!

Divya
ప్రతి ఒక్కరికి  అందరిలో విభిన్నంగా కనిపించాలనే కోరిక చాలా ఉంటుంది. అందుకు తగ్గట్టుగా తయారవుతూ ఉంటారు. అంతేకాకుండా ఏ ఫంక్షన్లకు, పార్టీలకు వెళ్ళినప్పుడు అందరికన్నా ప్రత్యేకంగా కనిపించాలని, అందుకు తగ్గట్టు ఫ్యాషన్ గా కనిపించే డ్రస్సులు వేసుకోవడం, అందుకు తగ్గట్టు చెప్పులు వేసుకోవడం, అంతే స్థాయిలో జువెలరీ వాడడం లాంటివి చేస్తుంటారు. ప్రస్తుతం యువత మరీ ముఖ్యంగా చెప్పుల వైపు మొగ్గు చూపుతోంది . అయితే ఏ డ్రెస్ వేసుకున్నప్పుడు, ఎలాంటి షూస్ వేసుకోవాలి, లేదా ఏ రకం చెప్పులు వాడాలి వంటి వాటిపై ఎక్కువ దృష్టి సారిస్తున్నారు.
ప్రస్తుతం మార్కెట్లో క్యాజువల్ వేర్ మీదకైనా,ఫార్మల్ డ్రెస్ మీదకైనా చక్కగా నప్పే స్నీకర్స్ లభిస్తున్నాయి. అయితే వీటిలో ఎలాంటి సందర్భానికి ఎలాంటి  స్నీకర్స్ ఎంచుకోవాలో చెబుతున్నారు" బాటా  ఇండియా లిమిటెడ్ కలెక్షన్ ఆఫీసర్"  "మట్టియో  లాంబర్ట్".. అయితే మనం కూడా ఎలాంటి సందర్భానికి,ఎలాంటి స్నీకర్స్  ఎంచుకోవాలో చూసేద్దాం రండి..

సండే సందడికి :
ప్రస్తుతం యువత ఆదివారం వచ్చిందంటే చాలు, అలా స్నేహితులతో జాలిగా గడపడానికి బయటకు వెళ్తుంటారు. అలా  వెళ్లేటప్పుడు గ్రీన్ కలర్ ఆఫ్ షోల్డర్ డ్రెస్,వాటికి తగ్గట్టుగా మెటాలిక్  స్నీకర్స్  మంచి లుక్ ని తెచ్చిపెడతాయి.
పార్టీస్.. ఫంక్షన్స్..
ఇక ఫ్రెండ్స్ తో కానీ ఫ్యామిలీ మెంబర్స్ తో కానీ పార్టీలకు లేదా ఏదైనా ఫంక్షన్లకు అటెండ్ అయినప్పుడు అందరిలో విభిన్నంగా కనిపించాలంటే,తళుక్కుమనే నియాన్ స్నీకర్స్ మంచి ఎంపిక.  ఇక బ్లాక్ డ్రెస్,నియాన్ స్నీకర్స్  కాంబినేషన్ అదిరిపోయే లుక్ ని ఇస్తుంది.
ఫ్యామిలీ పిక్నిక్:
రాబోయే వేసవి సెలవుల్లో మీ ఫ్యామిలీతో సరదాగా గడిపడానికి మీరు ఎంచుకునే డ్రెస్ కూడా చాలా ముఖ్యం. అందుకోసం నారింజ రంగులో ఉండే పుల్కా పాట్  డ్రెస్ ఎంచుకోవడంతో పాటు ఆ డ్రస్ మీదకి తెల్లని స్నీకర్స్  ఫర్ ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యాయి.
షాపింగ్ సమయానికి:
పండుగ షాపింగ్ కోసం వెళ్ళినప్పుడు ఎక్కువమంది ఉన్నారు.. అనుకోండి.. క్యూలో ఒక్కోసారి ఎక్కువ సమయం నిల్చోవాల్సి  వస్తుంది. అలాంటప్పుడు సౌకర్యంగా ఉండే జాగర్స్,లేత  రంగు టీ షర్ట్ వేసుకోవాలి.  ఇక నలుపు స్నీకర్స్  ఎంచుకోవాలి.  దాంతో ఎక్కువ సమయం నిల్చో గలుగుతారు.  సౌకర్యంగా ఉండడంతోపాటు  ఫ్యాషన్ గా కూడా కనిపిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: