అందం, ఆరోగ్యం ఆవనూనె తోనే సాధ్యం...ఇంకా అద్భుత ప్రయోజనాలు ఎన్నో..?
అలర్జీలు, దురద, దద్దుర్లు చర్మం పొడిబారినట్లు ఉండటం వీటన్నింటినీ ఆవ నూనె వాడటం వల్ల నివారించవచ్చు. ఆవనూనెలో యాంటీబ్యాక్టీరియల్,యాంటీ ఫంగల్ పుష్కలంగా ఉండటం వల్ల ఈ సమస్యలన్నింటినీ నయం చేస్తాయి.
చర్మం మృదువుగా ఉండాలంటే,ఆవనూనెలో, కొబ్బరి నూనె కలిపి చర్మంపై 10 నిమిషాల పాటు మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మం మృదువుగానూ, ప్రకాశవంతంగా ఉంటుంది.
ఆవనూనెను వేడి చేసి అరచేతుల్లో, అరికాళ్ళలో అప్లై చేసి మసాజ్ చేయడం వల్ల జలుబు, దగ్గు నుండి ఉపశమనం పొందవచ్చు.
బరువు తగ్గడానికి ఆవనూనె బాగా ఉపయోగపడుతుంది. ఆవనూనెను వంటల్లో వాడటం వల్ల చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిపోయి, మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది.ఫలితంగా బరువు తగ్గుతారు.
ఆవ నూనె ని వాడటం వల్ల మూత్రపిండాల సమస్య కు దూరంగా ఉండవచ్చు.ఇంకా ఫంగల్ ఇన్ఫెక్షన్ నుంచి బయటపడవచ్చు.జీర్ణ వ్యవస్థ తో సంబంధమున్న, చిన్న పేగు, జీర్ణాశయం,పెద్దపేగుల్లో నూ బ్యాక్టీరియాను చేరకుండా చేస్తుంది.
ఆవ నూనెతో చేసిన ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల సులభంగా జీర్ణమవుతాయి. దీనివల్ల మలబద్దక సమస్య రాకుండా ఉంటుంది.అలాగే కడుపు నొప్పితో బాధపడే వాళ్ళు ఆవ నూనెను ఉపయోగిస్తే కడుపు నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.
ఆవ నూనె వాడటం వల్ల శరీరంలోని ఉష్ణోగ్రతలను అదుపులో ఉంచుతుంది.శరీరం డీహైడ్రేషన్ కాకుండా కాపాడుతుంది.