కాంతులీనే చర్మం కోసం ఏం చేయాలంటే?
ముఖం సౌందర్యంగా ఉంటేనే మనలో ఆత్మవిశ్వాసం అంతకు రెట్టింపు అవుతుంది. అలాంటి ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించేందుకు మన ముఖ సౌందర్యం కూడా ఒకటని ఎంతో మంది నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఎలాంటి పద్ధతులను పాటించడం వల్ల చర్మం కాంతులీనుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
మరికొద్ది రోజుల్లో వేసవికాలం మొదలవబోతోంది. సూర్యుని నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాల వల్ల చర్మం డ్యామేజ్ అవుతుంది. ఫలితంగా ముఖంపై నల్లటి మచ్చలు, ట్యాన్ వంటివి వచ్చేస్తుంటాయి. ట్యాన్ పోగొట్టాలి అంటే మాత్రం ఎన్నో చిట్కాలు పాటిస్తుంటారు. కానీఇప్పుడు చెప్పబోయే ఒక చిట్కా మాత్రం అద్భుతంగా పనిచేస్తుంది. అది ఏమిటంటే కాఫీ స్క్రబ్. కాఫీ స్క్రబ్ చేయడం వల్ల ముఖం పై ట్యాన్ త్వరగా తగ్గిపోతుంది.
ఇందుకోసం ఒక చిన్న బౌల్ లో వన్ టేబుల్ స్పూన్ కాఫీపొడి, వన్ టేబుల్ స్పూన్ చక్కెర, 2 టేబుల్ స్పూన్స్ ఆలివ్ ఆయిల్. అన్నింటినీ ఒక బౌల్లో వేసుకొని మిక్స్ చేయాలి. ముఖానికి స్క్రబ్ చేసేముందు గోరువెచ్చని నీటిలో ఒక టవల్ ను అద్ది ముఖమంతా శుభ్రంగా తుడవాలి. ఆ తర్వాత తయారు చేసి పెట్టుకొన్న కాఫీ స్క్రబ్ ను మునివేళ్ళలోకి తీసుకొని, ముఖం అంతట వృత్తాకారంలో ఐదు నిమిషాల పాటుమర్దనా చేస్తూ ఉండాలి. ఆ తర్వాత ఒక అరగంట ఆరనిచ్చి, గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. అయితే ఈ ప్యాక్ అప్లై చేసిన రోజు మాత్రం ఎలాంటి సోపులను , ఫేస్ వాష్ లను ఉపయోగించకూడదు. మరుసటి రోజు సోప్ తో గాని ఫేస్ వాష్ తో కానీ శుభ్రం చేసుకుంటే ట్యాన్ తొలగిపోవడాన్ని ఇట్టే గమనించవచ్చు. అయితే ఈ పద్ధతిని పాటించడం వల్ల కేవలం ఒకటి,రెండు సార్లకే రిజల్ట్ వచ్చేస్తుంది.