అదొక్కటి ఉల్లిపాయలో కలిపి రాస్తే చాలు. మీరు కోరుకున్న జుట్టు మీ సొంతం అవుతుంది.

Divya

చాలా మంది జుట్టు ఆరోగ్యం కోసం ఎన్నో రకాల నూనెలు తెచ్చి జుట్టుకు వాడుతుంటారు. ఈ నూనెలు  ఎంత వరకు మన జుట్టుకు సహాయపడతాయో  ఎవరికీ తెలియదు. కానీ మార్కెట్లో దొరికే కొన్ని రకాల ఆయిల్స్ వల్ల  జుట్టు నిర్జీవంగా మారుతుంది  అన్న విషయం మాత్రం మనం గుర్తుంచుకోవాలి. కానీ కొంతమంది జుట్టు అందంగా ఉండడానికి మార్కెట్లో దొరికే ఎన్నో రకాల నూనెలు కోసం వేలకు వేలు ఖర్చు పెడుతుంటారు.అయితే తాత్కాలికమే.
కానీ ఇప్పుడు చెప్పబోయే చిట్కా పాటిస్తే ఎలాంటి ఖర్చు లేకుండా మీ జుట్టు అమాంతం పెరిగిపోతుంది. అంతేకాకుండా ఒత్తుగా,నల్లగా కూడా తయారవుతుంది. ఆ చిట్కా ఏంటో ఇప్పుడు చూద్దాం

ఇందుకోసం ముందుగా పింక్ కలర్ లో ఉండే రెండు ఉల్లిపాయలు తీసుకొని పైన పొట్టు తీసి,చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ ముక్కలను మిక్సీలో వేసి, మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టి అందులో 50 గ్రాముల ఆవనూనె లేదా కొబ్బరి నూనె వేసుకోవాలి.ఇప్పుడు తయారుచేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ ను ఇందులో వేయాలి. ఇప్పుడు స్టవ్ ను  సిమ్లో ఉంచుకొని ఒక ఇరవై నిమిషాల పాటు మిశ్రమాన్ని నూనెలో బాగా మరిగించాలి. ఆ తర్వాత స్టౌ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని రాత్రంతా అలాగే ఉంచాలి.

ఇప్పుడు  ఉదయాన్నే ఈ మిశ్రమాన్ని వడకట్టి,కంటైనర్ సీసాలో భద్రపరుచుకోవాలి. వడకట్టిన నూనెను మీ జుట్టు కుదుళ్ళకు పట్టించి బాగా మర్దనా  చేయాలి. తరువాత రెండు నుంచి మూడు గంటలపాటు అలాగే ఆరనివ్వాలి. ఇక మీకు నచ్చిన మైల్డ్ రెగ్యులర్ షాంపూతో తలస్నానం చేస్తే సరిపోతుంది. ఇక మనలో చాలామంది ఉల్లిపాయ రసాన్ని ఇష్టపడరు. ఇందుకోసం మీకు ఏదైనా నచ్చిన ఎసెన్షియల్ రెండు మూడు చుక్కలు కలుపుకుని వాడుకోవచ్చు.

ఉల్లిపాయల పేస్ట్ ను నూనెతో కలిపి జుట్టుకు రాసుకుంటే 90 శాతం వరకు జుట్టు రాలడాన్ని అరికట్టవచ్చు. అంతేకాకుండా పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల జుట్టు రాలడాన్ని కొంతవరకు తగ్గించవచ్చు. ఉల్లిపాయలో కొన్ని ముఖ్యమైన ఖనిజాలు ఉండడంవల్ల ఇవి మన జుట్టును కాపాడడానికి ఎంతో సహాయపడతాయి. ఇందులో ఉండే సల్ఫర్ నిర్జీవమైన జుట్టును ఆరోగ్యవంతంగా మారుస్తుంది.అంతేకాకుండా వీటిలో ఉండే యాంటీ  బ్యాక్టీరియల్ లక్షణాలు మన జుట్టు కుదుళ్లు దృఢంగా ఉంచడంలో సహాయపడతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: