అంజూరపండు ముఖ రంగును మార్చుతుందా?

Divya

అంజూరపండు మన శరీరానికి ఎంతో ఉపయోగపడుతుందని పెద్దగా చెప్పనవసరం లేదు. అంజూర పండ్లలో అధికంగా దొరికే ఐరన్ శరీరంలోని రక్తం స్థాయిలను పెంచడానికి ఎంతో ఉపయోగపడుతుంది. రక్తహీనత కలిగినవారు అంజూర పండ్లు తినడం వల్ల తిరిగి రక్తం శరీరంలోకి పుంజుకుంటుంది. అయితే కేవలం శరీరానికి మాత్రమే కాదు,ముఖ అందాన్ని కూడా పెంచుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
అంజూర పండును ముఖానికి ఏ విధంగా ఉపయోగిస్తే, ముఖ రంగు మార్చుకోవచ్చో  ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం.
ఇందులో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ తో పాటు ఐరన్ అధికంగా లభిస్తుంది.అంజూరపండ్లను ఫేస్ స్క్రబ్ గా  ఉపయోగించవచ్చు. ఇందుకోసం అంజూర పండ్ల తొక్క తీసి,గుజ్జునుమెత్తగా గ్రైండ్ చెయ్యాలి. ఈ మిశ్రమానికి ఒక స్పూన్ పాలు, ఒక టీ స్పూన్ తేనె కలిపి మునివేళ్లతో ముఖంపైన సుతిమెత్తగా మర్దనా చేయాలి. ఇలా చేయడం వలన ముఖం మీద ఉన్న మలినాలు తొలగిపోతాయి.
అంజీరపండు గుజ్జుకు 2 టేబుల్ స్పూన్ బాదం నూనె కలిపి ముఖానికి అప్లై చేయాలి. అరగంటసేపు ఆరనిచ్చి,చన్నీటితో శుభ్రం చేస్తే ముఖ చర్మం కాంతులీనుతుంది.అంతే కాకుండా ముఖం మీద ఉన్న బ్లాక్ హెడ్స్ కూడా తొలగిపోతాయి.కళ్ళ కింద నల్లటి వలయాలను కూడా అంజూరపండు గుజ్జును వాడి  తగ్గించుకోవచ్చు.అంజూర పండుకు ఒక రంగును మార్చే శక్తి కూడా ఉందని నిపుణులు సూచిస్తున్నారు.  వారానికి రెండు నుంచి మూడుసార్లు ఈ అంజూర పండ్ల నూ ఫేస్  స్క్రబ్ గా వాడటం వల్ల ముఖం మీద మృతకణాలు తొలగిపోయి అందంగా తయారవుతుంది.
అంజూర పండు జుట్టు రాలడాన్ని కూడా నియంత్రిస్తుంది.నిత్యం మన ఆహారంలో ఒక భాగంగా చేసుకోవడం వల్ల జుట్టు రాలడం చుండ్రు లాంటి సమస్యలు తగ్గి,జుట్టు ఆరోగ్యవంతంగ అవడంతోపాటు ప్రకాశవంతంగా తయారవుతుంది. ఎండిన అంజూర పండ్లను పొడిగా చేసుకొని, పాలలో కానీ, వేడి నీటిలో గాని కలిపి తీసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలు సమృద్ధిగా లభిస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: