మీ ముఖం కాంతివంతంగా మెరిసిపోడానికి ఈ పద్ధతులు పాటించండి...
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. చాలా మంది మొటిమలు, మచ్చలు సమస్యలతో అనేక రకాలుగా సతమతమవుతూ ఉంటారు. అవి తగ్గడానికి డాక్టర్ల చుట్టూ తిరిగి అనేక మందులు వాడి ఇంకా సైడ్ ఎఫెక్టులకి గురవుతూ ఉంటారు. కాని ఇవన్నీ మానిపోయి ముఖం కాంతి వంతంగా అవ్వడానికి ఈ వంటింటి చిట్కాలు చాలు. మనకు వంటింట్లో దొరికే పసుపు, తేనె, కొబ్బరి నూనె... ఇవి చాలు.. వీటితో అన్ని రకాల చర్మ సమస్యలు మాయం. ముఖంపై మొటిమలు, మచ్చలు పోయి ముఖం నీట్ గా శుభ్రంగా ఉండాటానికి ఈ ఫేస్ ప్యాక్ ని తయారు చేసుకొండి. ముఖం కాంతివంతంగా కళకళ లాడిపోతుంది...
ఫేస్ ప్యాక్ కి కావాల్సిన పదార్ధాలు :
పసుపు పొడి - 1-3 టీ స్పూన్లు
పెరుగు - ఒక టేబుల్ స్పూన్
తేనె - ఒక టీ స్పూన్
కొబ్బరి నూనె - ఒక టీ స్పూన్
ఫేస్ ప్యాక్ తయారు చేసే పద్ధతి:ఒక బౌల్ లో పెరుగు వేయండి.ఇందులో ఒక టీ స్పూన్ తేనె కలపండి.ఇప్పుడు ఒక టీ స్పూన్ కొబ్బరి నూనెను కలపండి.ఇప్పుడు ఇందులో పసుపు వేసి కలపండి.ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలపండి. ఈ మిశ్రమం స్మూత్ గా వచ్చేంతవరకూ కలపండి. మీ ఫేస్ ప్యాక్ రెడీ అయిపోయింది.
ఈ ఫేస్ ప్యాక్ కి ఎలా వాడాలంటే...ముందుగా ఫేస్ వాష్ చేసుకుని తడి పోయేటట్లుగా అద్దండి.ఈ ఫేస్ మాస్క్ ని అప్లై చేయండి.పదిహేను నిమిషాలు అలాగే వదిలేయండి. ఆ తరువాత గోరు వెచ్చని నీటితో కడిగేయండి.వారానికి ఒకసారి ఇలా చేస్తే కాంతివంతమైన చర్మం మీ సొంతం అవుతుంది. ఇక ఇలాంటి మరెన్నో బ్యూటీ టిప్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...