హెయిర్ ఫాల్ సమస్యని ఈ పద్ధతులు పాటించి శాశ్వతంగా దూరం చేసుకోండి...!
జుట్టు త్వరగా ఆరాలని చాలామంది బ్లో డ్రైయర్, హట్ రోలర్లను ఉపయోగిస్తున్నారు. దీనివల్ల జుట్టు పెళుసుగా మారుతుంది. వీటిని అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే వాడండి. అదేపనిగా వాడితే జుట్టు పొడిబారిపోయి చింపిరిగా కనిపించవచ్చు.
మీ తలకు సరిపడేంత బాదం నూనెను గిన్నెలో తీసుకుని కాసేపు వేడి చేయండి. చల్లారిన తర్వాత జుట్టుకు రాసుకుని నెమ్మదిగా మర్దనా చేయండి. అరగంట తర్వాత చల్లటి నీరు, షాంపూ, కండీషనర్తో శుభ్రం చేయండి.
స్విమ్మింగ్ పూల్లో ఎక్కువసేపు గడపడం కూడా జుట్టుకు హానికరమే. కాబట్టి.. ముందుగా జుట్టుకు కండీషనర్ రాసుకుని పూల్స్లోకి దిగండి.
జుట్టును చాలా సుకుమారంగా చూసుకోవాలి. దాన్ని ఇష్టానుసారంగా బిగించి కడితే.. కుదళ్లు వదులుగా మారిపోయి హెయిర్ ఫాల్ తీవ్రం అవుతుంది. వదులుగా వదిలేయడమే మంచిది.
ఇటీవల ఎలక్ట్రికల్ కోంబ్స్ వాడేవారి సంఖ్య పెరిగింది. వీటికి దూరంగా ఉండటమే బెటర్. జుట్టు తడిగా ఉన్నప్పుడు అస్సలు దువ్వకూడదు. అలా చేస్తే కుచ్చులుగా ఊడిపోతుంది.
తడి జుట్టుపై కొంచెం బీర్ పోసి రుద్దండి. 20 నిమిషాలు తర్వాత బీర్ వాసన పోయే వరకు బాగా కడకండి. ఇలా చేయడం వల్ల మీ జుట్టు మృదువుగా మారవచ్చు.
మీ జుట్టు పొడిబారినట్లుగా అనిపిస్తున్నట్లయితే.. గుడ్డును ఉపయోగించి చూడండి. ఒక హాప్ కప్ నిండా గుడ్డులోని తెల్ల సొనను తీసుకుని జుట్టుకు రాసుకోండి. 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి.
చుండ్రు, దురద సమస్యల వల్ల జుట్టు ఎక్కువగా రాలుతుంది. కాబట్టి.. జుట్టును ఎప్పడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. దుమ్మూ, దూళి తగలకుండా జాగ్రత్త పడాలి. మురికి చేతులతో పట్టుకోకూడదు.