ముఖంపై మచ్చలు (యాక్నే) తగ్గడానికి

HANUMA HANUMA
 తెల్లగా ఉన్నవారిని ఎక్కువగా బాధిస్తున్న సమస్య యాక్నే. చెంపలు, ముక్కు, నుదురు మీద నల్లటి అట్టలాగా యాక్నే ఏర్పడుతుంది. ఆ మచ్చలను వదిలించుకోడానికి ఈ చిట్కాలు పాటించండి చారెడు ఎర్రకందిపప్పు, చిటికెడు కర్పూరంలను తీసుకుని కొద్దిగా పాలతో కలిపి నూరాలి. ఆ మిశ్రమాన్ని రాత్రి పడుకునే ముందు మచ్చల మీద రాసుకోవాలి. ఉదయాన్నే గోరువెచ్చని నీటితో కడగాలి. ఎర్రకందిపప్పును నిమ్మపండు రసంతో నూరి ముఖానికి రాసినా, యాక్నే తగ్గుతుంది. ఒక గిన్నెలో నాటుకోడిగుడ్డులోని తెల్లసొన తీసుకోవాలి. ఆ సొనకు పచ్చి పసుపును కలిపి మచ్చలపై రుద్దాలి. పసుపు చెట్టు పువ్వులను దంచి తీసిన రసం మచ్చలపై రాస్తే క్రమంగా తగ్గి పోతాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: