హెయిర్ రాలిపోతుందా... ఇంట్లోనే ఆచరించే కొన్ని చిట్కాలు

Durga
అనేక అనేక పని ఒత్తిళ్ళతో జుట్టు ఊడిపోతోంది అని బాధపడే వాళ్ల సంఖ్య బాగా పెరిగిపోయింది. మరి ఊడిపోక ఏమవుతుంది... ఎటు చూసినా కాలుష్యం, విపరీతమైన ఒత్తిడి, నిద్రలేమి, పోషకాహారలోపం. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కారణాలు ఉన్నాయి. ఇప్పుడవన్నీ అనవసరం కాని జుట్టు రాలడాన్ని అరికట్టేందుకు ఇంట్లోనే ఆచరించే కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవేంటంటే.....  1. మందార ఆకుల్ని మరిగించిన నీళ్లని మాడుకు రాసుకుని తరువాత గాఢత తక్కువుగా ఉన్న షాంపూతో తలస్నానం చేయాలి.  2. ఆలివ్ నూనెను మర్దన చేసుకుంటే జుట్టు ఊడడం తగ్గుతుంది.  3. ఆవాలను పదినిమిషాల పాటు మంచి నీళ్లలో ఉడికించి చల్లారిన తరువాత ఆ నీటిని తాగాలి.  4. ఎండపెట్టిన ఉసిరికాయ ముక్కలు, కొబ్బరి నూనె కలిపి రాసుకుంటే జుట్టుకు మంచి టానిక్ అందినట్టే.  5. కొత్తిమీర రసం కూడా జుట్టు ఊడడాన్ని తగ్గిస్తుంది.  6. జీలకర్ర నానపెట్టిన ఆలివ్ నూనెను మాడుకు రాసుకోవాలి.  7. కొబ్బరి పాలు జుట్టు రాలడాన్ని తగ్గించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి.  8. క్యాబేజి, పాలకూర మిశ్రమాన్ని రాసుకుంటే కూడా జుట్టు రాలకుండా అరికట్టొచ్చు.  9. కారెట్, క్యాబేజీ రసం జుట్టు పెరుగుదలకు బాగా పనికొస్తుంది.    

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: