కాబోయే భర్త అలా ఉండాలి.. హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్?

praveen
ప్రస్తుతం సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చింది. దీంతో ఇంటర్నెట్లో అన్ని విషయాలను కూడా తెలుసుకోగలుగుతున్నారు జనాలు. అయితే ఈ సోషల్ మీడియా కారణంగా సినీ సెలబ్రిటీలకు ప్రేక్షకులకు మధ్య ఉన్న దూరం కూడా పూర్తిగా తగ్గిపోయింది. ఒకప్పుడు అయితే ఎక్కడో షూటింగ్ జరుగుతున్న దగ్గరికి వెళ్లి దూరంగా నిలబడి తమ అభిమాన సెలబ్రిటీలను చూసి సంతోష పడిపోయేవారు ప్రేక్షకులు. కానీ ఇప్పుడు మాత్రం సోషల్ మీడియా కారణంగా నేరుగా సినీ సెలబ్రిటీలతో  మాట్లాడటం చేస్తూ ఉన్నారు.

 అంతేకాదు తాము అడగాలనుకున్న ప్రశ్నలన్నింటినీ కూడా అడుగేస్తూ ఉండడం గమనార్హం. అయితే ఒకప్పుడు తమ పర్సనల్ లైఫ్ గురించి ఎప్పుడు సీక్రెట్ గా ఉంచుకోవడానికి ప్రయత్నించిన సినీ సెలబ్రిటీలు సైతం.. ఇక అన్ని విషయాలను కూడా అభిమానులతో షేర్ చేసుకోవడానికి ఎక్కడ వెనకడుగు వేయడం లేదు. ఈ క్రమంలోనే సినిమాల్లో చేసే పాత్రలతో పాటు ఇక తమకు కాబోయే భర్త ఎలా ఉండాలి.. ఎలాంటి క్వాలిటీస్ ఉంటే అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాము అనే విషయంపై కూడా కొన్ని కొన్ని సార్లు హీరోయిన్లు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. అయితే బాలీవుడ్ హీరోయిన్ కృతిసనన్ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయగా.. ఈ అమ్మడు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి.

 కాబోయే భర్త తనతో నిజాయితీగా ఉండాలని బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ అన్నారు. తనతో ఎక్కువ టైం గడుపుతూ బాగా చూసుకోవాలని చెప్పారు. ఏ విషయంలోనైనా ఆశలు పెట్టుకుంటే ఇబ్బంది పడతాము అంటూ చెప్పుకొచ్చింది కృతిసనన్. అందుకే తాను అలాంటి ఆశలు ఏం పెట్టుకోనని.. ఏం జరిగినా అంగీకరించడానికి ప్రయత్నిస్తాను అంటూ తెలిపింది. అయితే ఈ ముద్దుగుమ్మ లండన్ కు చెందిన కబీర్ బహియాతో పెళ్లికి సిద్ధమైంది అంటూ గత కొంతకాలం నుంచి బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక టాక్ చక్కర్లు కొడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: